
పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
రూ.21లక్షలతో అభివృద్ధి పనులు
ఆత్మకూరు(ఎం), ఆగస్టు29: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో మండలంలోని పుల్లాయిగూ డెం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. గ్రామంలో 790 మంది జనాభా ఉండగా.. 545 మంది ఓటర్లు, 176 ఇం డ్లు ఉన్నాయి. గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.21లక్షలతో రూ.12లక్షల60వేలతో వైకుంఠధా మం, రూ.2లక్షల 50వేలతో డంపింగ్ యార్డు, రూ.90 వేలతో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి రూ.5లక్షలతో సీసీరోడ్లను నిర్మించారు.
పచ్చదనంతో పరిశుభ్రంగా గ్రామం
ప్రభుత్వం చేపట్టిన హరితహారంతోపాటు పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలోని ప్రధాన వీధులపై 2,500 మొక్కలను నాటడంతోపాటు ఇంటింటికీ 1100 మొక్కలను పంపిణీ చేశారు. నాటిన ప్రతి మొక్కనూ రక్షించేందుకు పంచాయతీ ఆధ్వర్యంలో ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన వాటర్ ట్యాంకర్‌తో ప్రతిరోజూ ఆ మొక్కలకు నీటి ని పట్టడంతో నేడు ఏపుగా పెరగడంతోపాటు పచ్చదనం సంతరించుకున్నది. పరిశుభ్రతలో భాగంగా నిత్యం ట్రాక్ట ర్ ద్వారా పంచాయతీ సిబ్బంది ఇంటింటికెళ్లి తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తుండటంతో గ్రామం ఎక్కడ చూసినా పరిశుభ్రంగా కనబడుతున్నది.
పల్లె ప్రగతి వరం లాంటిది..
పల్లెప్రగతితో మా గ్రామ రూపురేఖలు మారిపోయాయి. గ్రామంలోని అన్ని వర్గాల వారి కోసం రూ.12లక్షల 60వేలతో వైకుంఠధామం, రూ.2లక్షల 50వేలతో డంపింగ్ యార్డు, రూ.90వేలతో పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయడంతోపాటు రూ.5 లక్షలతో సీసీరోడ్ల నిర్మాణం చేపట్టా. గ్రామస్తుల మద్దతుతోపాటు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సహకారంతో గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతాం.
-పెసరు గిరిజాగోపాల్రెడ్డి, సర్పంచ్ పుల్లాయిగూడెం
హరిత గ్రామంగా మార్చాలి
హరితహారంతోపాటు పల్లె ప్రగతిలో నూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం హర్షణీయం. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించడంతో నేడు గ్రామంలో ఎటు చూసినా పచ్చదనం సంతరించుకున్నది. గ్రామస్తులు కూడా తమ ఇండ్ల పరిసరాల్లో వివిధ రకాల మొక్కలను నాటి సంరక్షించి గ్రామాన్ని హరిత గ్రామంగా మార్చాలి.
-బత్తిని యాదగిరిగౌడ్, తెలంగాణ సాయుధపోరాటయోధుడు, గ్రామస్తుడు
గ్రామం పచ్చదనంగా మారింది
ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామం నేడు పచ్చదనం తోపాటు పరిశుభ్రంగా మారింది. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో గ్రామం అభివృద్ధిలో వెనుకబడిపోయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి పనులను చేపట్టారు.
-కొప్పుల పుష్పమ్మ గ్రామస్తురాలు
పచ్చదనం, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాం
పచ్చదనం, పరిశుభ్రతపై ప్రతిరోజూ గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నాం. గ్రామంలోని ప్రధాన వీధులపై నాటిన మొక్కలకు ట్రీ గార్డులను ఏర్పాటు చేయడంతోపాటు ఇంటింటికీ పంపిణీ చేసిన ప్రతి మొక్కనూ నాటి, సంరక్షించేలా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామస్తులు పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావాలి.
-చిప్పలపల్లి జనరంజన్ పంచాయతీ కార్యదర్శి