
యాదాద్రి, ఆగస్టు19: పనికిరాని ప్రతిపక్ష పార్టీల నాయకులు మదర్డెయిరీలో చేరి, పాడి రైతుల ఐక్యతను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నారని, పాడి రైతులందరూ కుట్రలను తిప్పికొట్టి తమ ఐక్యతను చాటాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎన్డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి సూచించారు. పాడి ఉత్పత్తిలో రాష్ట్రంలోనే ఆలేరు నియోజకవర్గం అగ్రగామిగా నిలుస్తూ వస్తున్నదన్నారు. నెలకు 5.60 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి చేస్తున్న పాడి రైతులకు వారు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
గురువారం యాదగిరిగుట్ట పట్టణంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 8మండలాలకు చెందిన గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన పాల సంఘం చైర్మన్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ విప్, డీసీసీబీ చైర్మన్ పాల్గొని చైర్మన్లను సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మదర్‌డెయిరీని భ్రష్టు పట్టించిన ఘనత గత కాంగ్రెస్ పార్టీదేనని విమర్శించారు. చైర్మన్లను కొనుగోలు చేసే సంస్కృతి ఆ పార్టీదేనని గుర్తు చేశారు. పాడి రైతులకు బోనస్ ఇవ్వని నాయకులు చైర్మన్లమని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఆలేరు పాడి రైతులు చైతన్యం, ధైర్యం, ఐక్యత కలిగినవారని, ఇదే ఐక్యతతో ప్రతిపక్ష పార్టీ నా యకుల విమర్శలను తిప్పికొట్టాలని సూచించారు. మదర్డెయిరీలో 305 పాలసంఘం చైర్మన్లు ఉంటే కేవ లం ఆలేరు నియోజకవర్గంలోనే 143 మంది చైర్మన్లు ఉన్నారని, అందరు ఐక్యంగా ఉండి మదర్‌డెయిరీ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నాయకుడని కొనియాడారు. రూ.4 ప్రోత్సాహకం అందజేసి పాడిరైతులను ఆదుకుంటామని వారు హామీఇచ్చారు. కొవిడ్ కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.
24 గంటల నాణ్యమైన విద్యుత్, ఆసరా, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి పథకాలను కొనసాగిస్తున్నారని అన్నారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే రాష్ట్రం రెండోస్థానంలో ఉంటే, రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా మొదటిస్థానంలో నిలిచిందన్నారు. పశుసంవర్ధకశాఖ మంత్రితో మాట్లాడి నియోజకవర్గంలో పశువైద్యాధికారుల నియామకాన్ని త్వరలో చేపడతామని వారు అన్నారు. కొంతమంది పాడి రైతులకు మృతి చెందిన గేదెల ఇన్సూరెన్స్ అందలేదని తమదృష్టికి వచ్చిందని, నేడు కలెక్టర్‌తో మాట్లాడి అందేలా కృషి చేస్తామని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఎల్‌డీఏ చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, జడ్పీటీసీలు తోటకూరి అనురాధ, పల్లా వెంకట్‌రెడ్డి, మదర్‌డెయిరీ డైరెక్టర్లు కళ్లెపల్లి శ్రీశైలం, లింగాల శ్రీకర్‌రెడ్డి, అర్కాల గాల్‌రెడ్డి, దొంతిరి సోమిరెడ్డి, చింతలపూ డి వెంకటరామిరెడ్డి, మోతె పూలమ్మ, టీఆర్ఎస్ మం డల పార్టీ అధ్యక్షులు దూదిపాల రవీందర్‌రెడ్డి, పడాల శ్రీనివాస్, బాషబోయిన ఉప్పలయ్య, పాల సంఘం చైర్మన్లు కొల్లూరి మల్లేశ్, ఇంద్రసేనారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఇమ్మడి దశరథ, మిట్ట వెంకటయ్య, పన్నాల అంజిరెడ్డి, ఎండీ బురాన్ తదితరులు పాల్గొన్నారు.