
స్వామివారికి పవిత్ర మాలలు వేసిన అర్చకులు
నేడు ఉత్సవాలకు పరిసమాప్తి
శ్రీవారి ఖజానాకు రూ. 7,41,041 ఆదాయం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బాలాలయంలో బుధవారం పవిత్రోత్సవాలు పంచరాత్రాగమశాస్త్ర రీతిలో జరిగాయి. స్వామివారి బాలాలయ మహామండపంలో ఉత్సవమూర్తులకు అర్చకులు తిరుమంజనాలు నిర్వహించారు. స్వామివారిని పట్టువస్ర్తాలు, బంగారు, ముత్యాల ఆభరణాలతో అలంకరించి 108 నూలుధారాలతో తయారు చేసిన పవిత్ర మాలలను పుణ్యజలాలతో సంప్రోక్షించి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి శాంతిహోమం చేపట్టారు.
పంచరాత్రాగమశాస్త్రరీతిలో పవిత్రోత్సవాలు .. నేడు పరిసమాప్తి
స్వామివారి ఖజానాకు రూ. 7,41,041 ఆదాయం
యాదాద్రి, ఆగస్ట్టు18: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో బుధవారం పవిత్రోత్సవాలు పంచరాత్రాగమశాస్త్ర రీతిలో జరిగాయి. బాలాలయ మహామండపంలో ఉత్సవమూర్తులకు అర్చకులు తిరుమంజనాలు నిర్వహించారు. స్వామివారికి పట్టువస్ర్తాలు, బంగారు, ముత్యాల ఆభరణాలను అలంకరించి 108 నూలుధారాలతో తయారు చేసిన పవిత్ర మాలలను పుణ్యజలాలతో సంప్రోక్షించి పూజ లు చేశారు. అనంతరం స్వామివారికి శాంతిహోమం చేపట్టారు. స్వామిఅమ్మవార్లకు మూల, ముక్తి మంత్రా లు, వేదమంత్ర పఠనాలతో హవన పూజలు చేశారు. పూర్ణాహుతి పర్వాలను నిర్వహించి పవిత్ర మాలలను బాలాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడు రోజులపాటు కొనసాగే పవిత్రోత్సవాలను గురువారం ప్రధానాలయంలోని స్వయంభూవులకు పవిత్రధారణ, బాలాలయంలోని యాగశాలలో మహాపూర్ణాహుతి హోమంతో ఉత్సవాలకు పరిసమాప్తి పలుకనున్నారు.
పాతగుట్టలో..
పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయంలో హవనం, హోమం, అర్చనలు వంటి కార్యక్రమాలను అర్చకులు చేపట్టారు. నూలుపోగులతో తయారు చేసిన పవిత్రమాలలకు యాగశాలలో పూజలు నిర్వహించి, స్వ యంభూవులకు వేశారు. సాయంత్రం ఆలయ గోపురంపై ఉన్న సుదర్శన చక్రానికి పవిత్రధారణ గావించారు.
స్వామివారికి అభిషేకం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో అర్చకులు స్వామివారిని పంచామృతాలతో అభిషేకించారు. ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు స్వయంభువులు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపారు. ఉత్సవమండపంలో ఉత్సవ విగ్రహాలకు పట్టువస్ర్తాలు, స్వర్ణ ఆభరణాలతో అలంకరించి నిజాభిషేకం, తులసీఅర్చనలు చేపట్టారు. కొండపైన ఉన్న శివాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాల్లో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేపట్టారు. పవిత్రోత్సవాల్లో భాగంగా స్వామివారి సుదర్శన నారసింహ హోమం, తిరుకల్యాణ మహోత్సవాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
స్వామివారి ఖజానాకు రూ.7,41,041 ఆదాయం
స్వామివారి ఖజానాకు రూ.7,41,041 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ.47,864, రూ.100 దర్శనంతో రూ. 33,000, నిత్యకైంకర్యాలతో రూ.1,800, సుప్రభాతంతో రూ.300, క్యారీబ్యాగులతో రూ.1,650, సత్యనారాయణ స్వామి వ్రతాలతో రూ. 84,000, కల్యాణకట్టతో రూ.20,000, ప్రసాద విక్రయంతో రూ. 3,04,950, శాశ్వతపూజలతో రూ.6,000, వాహనపూజలతో రూ.8,500, టోల్గేట్తో రూ.900, అన్నదాన విరాళంతో రూ.11,312, సువర్ణ పుష్పార్చనతో రూ.85,980, యాదరుషి నిలయంతో రూ.66,070, పాతగుట్టతో రూ.29,715, టెంకాయల విక్రయంతో రూ. 39,000 తో కలుపుకొని రూ. 7,41,041 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.