
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సాధారణంగా మనం ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే పేరు, మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ అవసరం. ఆ వివరాలు ఇవ్వగానే మనకు యూజర్ ఐడీ క్రియేట్ (https:// www. facebook.com/ pingali ఇలా ఉంటుంది) అవుతుంది. ఆ తదుపరి మన ప్రొఫైల్ ఫొటో, మనకు ఇష్టమున్న పేరును పెట్టుకోవచ్చు. ఇంత వరకు బాగానే ఉన్నది. కానీ, ఇటీవలి కాలంలో ఫేస్బుక్ యూజర్లను సైబర్ దాడి భయపెడుతున్నది. కొంతకాలంగా రెచ్చిపోతున్న సైబర్ నేరస్తులు, అకౌంట్‌ను హ్యాక్ చేసి బ్లాక్ మెయిల్ చేయడమో..? లేదంటే ఫేక్ ఐడీ క్రియేట్ చేసి మన పేరు మీద డబ్బులు వసూలు చేయడమో చేస్తున్నారు. ముందుగా పెద్ద సంఖ్యలో ఫేస్బుక్ అకౌంట్లు స్టడీ చేస్తున్నారు. అందులో వారి అంచనాలకు తగిన విధంగా ఉన్న వారిని సెలెక్టు చేసుకుంటున్నారు. అలా టార్గెట్ చేసిన వ్యక్తుల ప్రొఫైల్ ఫొటోలు, పేరును తీసుకొని.. ఫేక్
ఐడీలు క్రియేట్ చేస్తున్నారు. అప్పటికే క్రియేట్ చేసుకున్న ఐడీని గానీ, లేదా కొత్తగా క్రియేట్ చేసిన ఐడీని గానీ టార్గెట్ చేసిన వ్యక్తి పేరు, ఫొటోలు వాడుతున్నారు. అవి మన స్నేహితులు ఎవరైనా చూస్తే ఆ అకౌంట్ మనదే అని పొరబడే ప్రమాదముంటున్నది.
ఫేక్ అకౌంట్ అని గుర్తించగానే.. మన మిత్రులెవ్వరూ మోసపోకుండా వెంటనే మనమే రంగంలోకి దిగాలి. ముందుగా ఫేక్ అకౌంట్‌ను బ్లాక్ చేయాలి. అందుకోసం ఫేస్బుక్ సంస్థకు ఫిర్యాదు చేయాలి. అది ఎలాగంటే మనకు వచ్చిన ఫేక్ ప్రొఫైల్ పేరుపై క్లిక్చేయాలి. ఆ తదుపరి మెసేజ్ పక్కన మూడు చుక్కలుగా (…) కనిపించే సింబల్‌పై క్లిక్‌చేసి ఫ్రొపైల్ సెట్టింగ్‌లోకి వెళ్లాలి. ఇక్కడ find support or repot profile పై క్లిక్చేయాలి. క్లిక్చేయగానే ‘ప్లీజ్ సెలెక్టు ఏ ఏప్రాబ్లం’ ఆప్షన్ వస్తుంది. ఇందులో pretending to be someone అనే ఆప్షన్‌పై క్లిక్ చేయగానే me అనే అప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి submit పై నొక్కితే ఫేక్‌బుక్ వాళ్లు వెంటనే స్పందించి సదరు అకౌంట్‌ను నిలిపి వేస్తారు. దాంతో ఆ ఫేక్ అకౌంట్
శ్రీనివాస్ పేరిట ఇటీవల ఫతే సింగ్ అనే వ్యక్తి ఫేక్ ఐడీ క్రియేట్ చేశాడు. శ్రీనివాస్ ఫ్రెండ్స్ లిస్టులోని అందరికీ ఫ్రెండ్ రిక్విస్ట్ పెట్టడమే కాదు, మెసెంజర్ ద్వారా కొందరితో చాటింగ్ చేశాడు. ‘హాస్పిటల్లో ఉన్నాను. అర్జంట్‌గా డబ్బులు కావాలి’ అని మెసేజ్ పంపించాడు. ఆ మేరకు ఓ వ్యక్తి స్పందించి 20 వేలను సైబర్ నేరస్తుడు చెప్పిన ఫోన్ నంబర్‌కు పంపగా, మరో 10 వేలు పంపించాలని కోరాడు. దాంతో డబ్బులు పంపిన వ్యక్తి అనుమానించి, శ్రీనివాస్‌కు ఏమైందో తెలుసుకుందామని ఇంటికెళ్లడంతో అసలు విషయం తెలిసింది. తన పేరిట ఫేక్ అకౌంట్ క్రియేట్ అయిందని శ్రీనివాస్ గుర్తించి, ఫేస్బుక్ సంస్థతోపాటు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే.