
రైతుబంధు సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఎస్ఏ రజాక్
చౌటుప్పల్, సెప్టెంబర్ 12 : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దక్షతతో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎదురు లేని శక్తిగా ఎదిగిందని రైతుబంధు సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, పార్టీ ఎన్నికల పరిశీలకుడు ఎస్ఏ రజాక్ అన్నారు. మండలంలోని నేలపట్ల గ్రామంలో ఆదివారం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించి గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పబ్బతి ఆంజనేయులుగౌడ్, ప్రధాన కార్యదర్శిగా బూడిద లింగస్వామి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కప్పల శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండు మల్లయ్యగౌడ్, నాయకులు బాలరాజు, శ్రీనివాస్, వెంకటయ్య పాల్గొన్నారు.
2వ వార్డు అధ్యక్షుడిగా నగేశ్‌గౌడ్
చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 2వ వార్డు అధ్యక్షుడిగా బొంగు నగేశ్‌గౌడ్, ఉపాధ్యక్షుడిగా శ్రీధర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శిగా పోలెపల్లి ముత్యాలు, కోశాధికారిగా కూసుకుంట్ల ఆండాలు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బత్తుల రాజ్యలక్ష్మి, నాయకులు బత్తుల స్వామిగౌడ్, బొంగు మల్లేశ్‌గౌడ్, గుత్తా శ్రీధర్‌రెడ్డి, నర్సింహ పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు ఆధ్వర్యంలో 16వ వార్డు కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కానుగు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శిగా సిలివేరు శ్రీశైలం, ఉపాధ్యక్షుడిగా వీరమళ్ల యాదయ్య, కోశాధికారిగా మైలారం రాఘవేంద్ర, సంయుక్త కార్యదర్శిగా మహ్మద్ అజీజ్ ఎన్నికయ్యారు.
బీబీనగర్ మండలంలో..
బీబీనగర్ : మండలంలోని రహీంఖాన్‌గూడలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మంచాల రవికుమార్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పంజాల రామారావుగౌడ్, ఉపాధ్యక్షుడిగా గడ్డం రవి, ప్రధాన కార్యదర్శిగా కూనోజు నర్సింహ, యువజన సంఘాల అధ్యక్షుడిగా బద్దం శేఖర్‌రెడ్డి ఎన్నికయ్యారు. పల్లెగూడెం అధ్యక్షుడిగా తిప్పిడి మాధవరెడ్డి, చిన్నరావులపల్లి అధ్యక్షుడిగా బెజవాడ సతీశ్, కార్యదర్శిగా నరసింహ, రుద్రవెల్లి-దోసపాటి బాలరాజు, జమీలాపేట్-రమేశ్‌యాదవ్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాపాక జంగయ్య, జిల్లా విజిలెన్స్ మానిటర్ కమిటీ సభ్యులు మంచాల నరహరి, పంజాల భుజంగరావు, యాదగిరి, సత్యనారాయణగౌడ్, ప్రభాకర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వలిగొండ మండలంలో..
వలిగొండ మండలంలోని పహిల్వాన్పూర్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా గూడూరు నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రేపాక నర్సింహ, మొగిలిపాక-భీమనబోయిన భిక్షపతి, జడిగె మహేశ్, ఎం.తుర్కరల్లి – బెల్లి నర్సింహ, దనిరేకుల లింగయ్య, వేములకొండ- సాయిని నాగేశ్, ఇంజమూరి రాము, వెంకటాపురం-జెట్టి నరేశ్, జక్కుల అయిలయ్య, ముద్దాపురం గ్రామ శాఖ అధ్యక్షుడిగా వాకిటి ధర్మారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నాయిని నర్సిరెడ్డిని ఎన్నుకున్నారు. కొత్త కమిటీ సభ్యులను పార్టీ మండలాధ్యక్షుడు డేగల పాండరి, మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ముద్దసాని కిరణ్‌రెడ్డి, ఎంపీటీసీ తుమ్మల వెంకట్‌రెడ్డి, సర్పంచులు కొత్త నర్సింహ, బోడ లక్ష్మమ్మబాలయ్య, నాయకులు రమేశ్, శంకరయ్య, వెంకటేశ్, జనార్దన్‌రెడ్డి, మహేశ్, బాలరాజు, ధనుంజయ్య అభినందించారు.
భూదాన్‌పోచంపల్లి
భూదాన్‌పోచంపల్లి : మండలంలోని పలు గ్రామాల కమిటీలను ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ కోట పుష్పలతామల్లారెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశం యాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సాయినగర్ అధ్యక్షుడిగా గౌని దాసుగౌడ్, ప్రధాన కార్యదర్శిగా వీరమల్లు రవి, జూలూరు-వాకిటి మాధవరెడ్డి, పులమోని శ్రీనివాస్, పిలాయిపల్లి-ప్యాట చంద్రశేఖర్, కుతాడి మహేశ్, పెద్దరావులపల్లి అధ్యక్షుడిగా సంపత్, దంతూరు గ్రామ శాఖ అధ్యక్షుడిగా బోదాసు సత్తయ్య ఎన్నికయ్యారు. భూదాన్‌పోచంపల్లి పట్టణ 8వ వార్డు అధ్యక్షుడిగా రామసాని రఘునాథ్‌రెడ్డిని ఎన్నుకున్నారు. కార్యక్రమాల్లో నాయకులు భూపాల్‌రెడ్డి, లింగం యాదవ్, శేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, మాధవి, భిక్షపతి, నోముల మాధవరెడ్డి, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.