
సీఎం కేసీఆర్‌చిత్రపటానికి క్షీరాభిషేకం
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకంహుజూరాబాద్
టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఎంపికపై హర్షం
బీబీనగర్‌లో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేస్తున్న
టీఆర్ఎస్వీ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కి నగేశ్ తదితరులు
ఆలేరు టౌన్, ఆగస్టు 11 : హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమని టీఆర్ఎస్వీ ఆలేరు టౌన్ ప్రెసిడెంట్ ఎమ్మె కళ్యాణ్ అన్నారు. బుధవారం ఆ యన ఆలేరులో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీనివాస్‌యాదవ్ చురుకుగా పని చేయడంతో పాటు పలుమార్లు జైలుకు వెళ్లాడని పేర్కొన్నారు. ఉద్యమ స్పూర్ఫిని చూసి సీఎం కేసీఆర్ ఆ యన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయ డం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుపు ఖాయం
తుర్కపల్లి, ఆగస్టు 11: టీఆర్ఎస్వీ నాయకుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుపు ఖాయమని టీఆర్ఎస్వీ ఆలేరు నియోజక వర్గ కన్వీనర్ ర్యాకల రమేశ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా విద్యార్థి నాయకుడు శ్రీనివాస్‌యాదవ్ పేరును ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు కానుగంటి భాస్కర్, యువజన నాయకులు ఇరుగుదిండ్ల కరుణాకర్, భాస్కర్‌నాయక్, మన్నె మహేశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
బీబీనగర్, ఆగస్టు 11 : హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమ నాయకుడు టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ప్రకటించినందుకు బుధవారం బీబీనగర్ మండలంలోని కొండమడుగు మెట్టు వద్ద టీఆర్ఎస్వీ నాయకుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ ప్రాంతీయ పార్టీల నాయకులు విద్యార్థులను ఓటు బ్యాంకుగా వాడుకున్న సందర్భాలు అనేకంగా ఉన్నాయని, కేసీఆర్ మాత్రం విద్యార్థి నాయకులకు అనేక అవకాశాలు కల్పిస్తూ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నారన్నారు. రాష్ట్రం సాధించుకున్న తరువాత ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేషన్ చైర్మన్లుగా ఎంతో మంది విద్యార్థి నాయకులను నియమించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీనివాస్‌యాదవ్ పేరును ప్రకటించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ భువనగిరి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఎండీ మున్నా, ప్రధాన కార్యదర్శి కడెం కిరణ్ కుమార్, పాండు, జక్కి నర్సింహ, మునగాల మధుసూదన్, మునగాల ప్రసాద్, ఏర్పుల ముత్యాలు, రంజిత్, మహేశ్, నరేశ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.