
యాదాద్రి, ఆగస్టు10: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో మంగళవారం క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టారు. విష్ణుపుష్కరిణి చెంత గల గుడిలో హనుమంతుడిని సిందూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చన చేశారు. వేదమంత్రాల మధ్య జరిగిన పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. లలితాపారాయణం చేసి, ఆంజనేయస్వామి వారికి ఇష్టమైన వడపప్పు. బెల్లం, అరటి పండ్లను నైవేద్యం గా సమర్పించారు. భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో నిత్యపూజలు ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా అర్చకులు పూజలను కొనసాగాయి. స్వామివారి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత శ్రీసుదర్శన నారసింహహోమం జరిపారు. సాయం త్రం వేళ అలంకార సేవోత్సవాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. అలంకార సేవోత్సవంలో పాల్గొ న్న భక్తులకు స్వామి, అమ్మవార్ల ఆశీస్సులు అర్చకులు అందజేశారు. శ్రావణమాసం సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు భారీగా జరిగా యి. భక్తుల పాల్గొని వ్రతమాచరించారు. పాతగుట్టలోని లక్ష్మీనరసింహస్వామి వారి నిత్యపూజ లు ఆలయ సంప్రదాయ రీతిలో సాగాయి.
స్వామి వారి ఖజానాకు రూ. 9,38,099 ఆదా యం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ.96,056, రూ.100 దర్శనంతో రూ.41,000, నిత్యకైంకర్యాలతో రూ.1,800, సుప్రభాతం ద్వారా రూ.200, క్యారీబ్యాగులతో రూ.4,200, సత్యనారాయణ స్వామి వ్రతాలతో రూ.51,000, కల్యాణకట్టతో రూ. 25,000, ప్రసాద విక్రయంతో రూ. 4,73,250, శాశ్వతపూజలతో రూ.10,116, వాహన పూజలతో రూ.11,000, టోల్గేట్తో రూ.1,040, అన్నదాన విరాళంతో రూ.3,112, సువర్ణ పుష్పార్చనతో రూ.83,900, యాదరుషి నిలయంతో రూ.54,880, పాతగుట్టతో రూ. 15,145, పుష్కరిణి ద్వారా రూ.400, టెంకాయల విక్రయంతో రూ. 66,000తో కలుపుకొని రూ.9,38,099 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం లో శ్రావణమాసం సందర్భంగా ఆండాళ్ అమ్మవారి తిరునక్షత్ర ఉత్సవం అత్యంత వైభవంగా కొనసాగుతున్నది. రెండోరోజులో భాగంగా ఆం డాళ్ అమ్మవారిని దివ్యమనోహరంగా అలంకరించి వేదమంత్రాలు, అభిషేకాలతో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం అమ్మవారికి పురపాట్ సేవను నిర్వహించారు.
పాతగుట్ట యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి యాదగిరిగుట్టకు చెం దిన కొడకండ్ల ఆండాళమ్మ బంగారు ఆభరణాన్ని బహూకరించారు. ఆమె భర్త, పాతగుట్ట లక్ష్మీనరసింహస్వా మి వారి ఆలయాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన కీర్తిశేషులు తిరుమలాచార్యులు. ఆయన జ్ఞాపకార్థం 13 గ్రాములు బంగారు నెక్లెస్తోపాటు పట్టు చీరె, పట్టు దోవతిని ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తికి మంగళవారం ఆమె అందజేశారు. కార్యక్రమంలో ఆల య ప్రధానార్చకుడు మోహనాచార్యులు, ఏఈవో భాస్కర్శర్మ తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి 15 రోజుల హుండీల ఆదా యం రూ. 43 లక్షలు దాటిందని యాదాద్రి ఆలయ ఈవో గీత తెలిపారు. మంగళవారం యాదాద్రి కొండపై గల హరితహోటల్లో హుండీలను లెక్కించగా, రూ. 43,42,556 ఆదాయం వచ్చిందని, మిశ్రమ బంగారం 54 గ్రా ములు, మిశ్రమ వెండి నాలుగు కిలోల 950 గ్రాములు వచ్చిందని ఆమె తెలిపారు.