
గ్రామాల్లో టీఆర్ఎస్ కార్యవర్గాల ఎన్నిక
భవనగిరి అర్బన్, సెప్టెంబర్ 9: భువనగిరి మండలంలోని 31 గ్రామాల్లో గురువారం టీఆర్ఎస్ గ్రామశాఖ కమిటీల ఎన్నిక జరిగిందని, అధ్యక్ష, కార్యదర్శులతోపాటు కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ మండలాధ్యక్షుడు జనగాం పాండు తెలిపారు. తుక్కాపురం గ్రామశాఖ అధ్యక్షుడు రాసాల శేఖర్‌యాదవ్, యూత్ అధ్యక్షుడు రాసాల శరత్, యెర్రబెల్లి గ్రామశాఖ అధ్యక్షుడు పెద్దింటి నర్సింహగౌడ్.. హన్మాపురం -రాగాల శ్రీనివాస్, వడపర్తి- సేవర్తి బాలరాజు, బాలంపల్లి -దూడల మల్లయ్య, వడాయిగూడెం -శెట్టి శ్రీకాంత్‌యాదవ్, గంగసానిపల్లి -బోయిని పాపయ్య, ముత్తిరెడ్డిగూడెం -గౌటి సతీశ్, బీఎన్ తిమ్మాపురం – డొంకెన ప్రభాకర్, మన్నెవారిపంపు -పైళ్ల దేవేందర్‌రెడ్డి, తాజ్పూర్ -ర్యాకల శ్రీనివాస్, అనంతారం -బొట్టు మల్లేశం, అనాజీపురం -బాత్క అశోక్, రెడ్డినాయక్‌తండా -ఇస్లావత్ నరేశ్‌నాయక్, పచ్చర్లబోడుతండా -కున్సోతు భగవాన్‌నాయక్, ఆకుతోటబావితండా – హలావత్ రెడ్డినాయక్, సూరేపల్లి -కొండూరు సత్యనారాయణగౌడ్, బొల్లెపల్లి -వనం రమేశ్‌ముదిరాజ్, సిరివేణికుంట-గోగు సిద్దయ్య, నాగిరెడ్డిపల్లి – చుక్క పద్మయ్య, నందనం-కళ్లెం రంగయ్య, నమాత్‌పల్లి బబ్బూరి రమేశ్‌గౌడ్, చందుపట్ల -దంతూరి సత్యనారాయణగౌడ్, రామచంద్రాపురం -భువనగిరి ఎల్లయ్య, కేసారం- కమ్మగాని నర్సింహ్మ, కూనూరు- పాశం మహేశ్, పెంచికల్‌పహాడ్ -గోపె నర్సింహ, జమ్మాపురం -మాదాసు మోహిజ్, బండసోమారం – నల్లమాస అశోక్‌గౌడ్, ముస్త్యాలపల్లి – పాల మహేశ్గౌడ్లతోపాటు కమిటీ సభ్యులను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. మరో మూడు గ్రామ కమిటీల నియామకం నేడు పూర్తవుతుందని ఆయన చెప్పారు.
పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి
రామన్నపేట : టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు నంద్యాల భిక్షంరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఇంద్రపాలనగరం, లక్ష్మాపురం గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామశాఖలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇంద్రపాలనగరం గ్రామశాఖ అధ్యక్షుడిగా గర్దాసు విక్రం, ఉపాధ్యక్షుడిగా సింగనబోయిన దాశరథి, కార్యదర్శిగా రవ్వ నర్సింహ, లక్ష్మాపురం అధ్యక్షుడిగా నీల లింగయ్య, ఉపాధ్యక్షుడిగా గడ్డం పరశు రాములు, కార్యదర్శిగా కొయ్యగూర వెంకటేశం, కొత్తగూడెం అధ్యక్షుడిగా బద్దం శ్రీను, కార్యదర్శిగా పొట్టకృష్ణ ఎన్నికయ్యారు. కార్యక్రమాల్లో మండల ప్రధానకార్యదర్శి కంభంపాటి శ్రీనివాస్, మందడి సాగర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, పున్న జగన్మోహన్, ఉదయ్‌రెడ్డి, కన్నెబోయిన బలరాం, బొక్క మాధవరెడ్డి, ఆవుల నరేందర్ పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లిలో..
భూదాన్‌పోచంపల్లి : మండలంలోని పలు గ్రామాల టీఆర్ఎస్ కమిటీలను గురువారం ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశం యాదవ్, జడ్పీటీసీ కోట పుష్పలతామల్లారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శివారెడ్డిగూడెం గామ అధ్యక్షుడిగా సరసాని నర్సిరెడ్డి, కనుముక్కుల- చుక్క జంగయ్య, జిబ్లక్‌పల్లి – వలమల్ల సత్యనారాయణ ఎన్నికయ్యారు. మిగతా కార్యవర్గాన్ని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు కందాడి భూపాల్‌రెడ్డి, రావుల శేఖర్‌రెడ్డి, సామ రవీందర్‌రెడ్డి, బత్తుల మాధవీశ్రీశైలంగౌడ్, నోముల మాధవరెడ్డి, ఐతరాజు భిక్షపతి, రంగ విశ్వనాథం, బండి కృష్ణ, సిల్వేరు బాలనర్సింహ, ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మున్సిపాలిటీలో
పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో మున్సిపల్ చైర్ పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్, వైస్ ఎంపీపీ బాత్క లింగస్వామి యాదవ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సీత వెంకటేశం ఆధ్వర్యంలో వార్డు కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 3వార్డు అధ్యక్షుడిగా గోదాసు సీతయ్య, 4వ వార్డు అధ్యక్షుడిగా తాళ్లపల్లి సతీశ్, 7వ వార్డు అధ్యక్షుడిగా గుండు ప్రవీణ్ ఎన్నికయ్యారు.