యాదాద్రి, సెప్టెంబర్7 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి గురువారం నిత్యపూజలు అత్యంత వైభవంగా జరిగాయి. పంచామృతాలతో స్వామివారి కైంకర్యాలు శాస్ర్తోక్తంగా ప్రారంభించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లను అభిషేకించి తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం జరిపించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరపాటు కల్యాణతంతు జరిపారు. కల్యాణమూర్తులను ముస్తాబు చేసి బాలాలయ ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణతంతు జరిపారు. సాయంత్రం స్వామి, అమ్మవారి అలంకార జోడు సేవలు నిర్వహించారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్ర నామార్చన జరిగాయి. కొండపైన క్యూ కాంప్లెక్స్‌లోని ప్రత్యేక గదిలో కొలువైన పర్వతవర్ధినీ రామలింగేశ్వరుడికి పురోహితులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో స్వామివారి నిత్యపూజలు ఆగమశాస్త్రం ప్రకారం చేపట్టారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 44,306
రూ.100 దర్శనం టిక్కెట్ 9,700
వేద ఆశీర్వచనం 3,096
నిత్యకైంకర్యాలు –
సుప్రభాతం –
క్యారీబ్యాగుల విక్రయం 1,225
వ్రత పూజలు 7,500
కల్యాణకట్ట టిక్కెట్లు 6,600
ప్రసాద విక్రయం 1,16,480
వాహన పూజలు 2,600
టోల్గేట్ 510
అన్నదాన విరాళం 3,548
సువర్ణ పుష్పార్చన 36,040
యాదరుషి నిలయం 11,000
పాతగుట్ట నుంచి 3,750