ఆలేరు రూరల్, అక్టోబర్ 4 : మండలంలోని కొల్లూరు గ్రామంలో సోమవారం బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కోటగిరి జయమ్మ మాట్లాడుతూ తెలంగాణ సంప్రదాయ పండుగైన బతుకమ్మను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు జనగాం వెంకటపాపిరెడ్డి, మహిళలు పాల్గొన్నారు.
రాజాపేట మండలంలో..
రాజాపేట : మండలంలోని జాల, కొత్తజాల, నర్సాపురం గ్రామాల్లోని మహిళలకు ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరెలను ఆయా గ్రామాల సర్పంచులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచులు గుంటి మధుసూదన్‌రెడ్డి, ఠాకూర్ ధర్మేందర్‌సింగ్, నాగిర్తి గోపిరెడ్డి మాట్లాడుతూ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా ప్రభుత్వం చీరెలను పంపిణీ చేస్తుందన్నారు.
ఆత్మకూర్(ఎం)మండలంలో..
ఆత్మకూరు(ఎం) : మండలంలోని కూరెళ్ల, మొరిపిరాల గ్రామాల్లో బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ తండ మంగమ్మ, వైస్ ఎంపీపీ బాషబోయిన పద్మ, సర్పంచులు బాషబోయిన ఉప్పలయ్య, సామ తిర్మల్‌రెడ్డి, ఆర్ఐ చిప్పలపల్లి యాదగిరి, ఉప సర్పంచులు నరేశ్, జ్యోతి, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, రేషన్ డీలర్లు, నాయకులు పాల్గొన్నారు.
తుర్కపల్లి మండలంలో..
తుర్కపల్లి : మండల కేంద్రం, తిరుమలాపురం, వాసాలమర్రి గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో సర్పంచులు నామసాని సత్యనారాయణ, పోగుల ఆంజనేయులు, పడాల వనిత, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పలుగుల నవీన్‌కుమార్, ఎంపీటీసీ బోరెడ్డి వనజ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
మోటకొండూరు మండలంలో..
మోటకొండూర్ : మండలంలోని పలు గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకొనేందుకే ప్రభుత్వం బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.