
యాదాద్రి, సెప్టెంబర్2: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంతోపాటు పాతగుట్ట ఆలయంలో కృష్ణాష్టమి ముగింపు వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. మూడోరోజు వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణుడి విగ్రహాన్ని దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. తొలుత బాలాలయంలో లక్ష్మీనారసింహులను ప్రత్యేకంగా అలంకరించి ఉట్ల సేవోత్సవాన్ని చేపట్టారు. పాలు, వెన్నతో కూడిన ఉట్టికి పూజలు చేశారు. ఉట్టితో ఆలయ నిర్వాహకులు, అర్చకులు, సిబ్బంది, చిన్నారులతో క్రీడాస్థలికి చేరుకుని ఉట్టికొట్టారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఎన్. గీత, ధర్మకర్త బి. నరసింహమూర్తి, ప్రధానార్చకులు మోహనాచార్యులు, మాధవాచార్యులు, ఆలయ ఏఈవోలు గట్టు శ్రవణ్కుమా ర్, గజవెల్లి రమేశ్‌బాబు, దోర్బాల భాస్కర్‌శర్మ, ఆలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
రుక్మిణీదేవి కల్యాణం..
శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి యాదాద్రీశుడి బాలాలయంలో రుక్మిణీకృష్ణుల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. కల్యాణోత్సవపర్వంతో యాదాద్రిలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ముగిశాయని ఆలయ అర్చకులు వెల్లడించారు.
ప్రత్యేక పూజల కోలాహలం..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం లో గురువారం ప్రత్యేక పూజల కోలాహలం నెలకొంది. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామిఅమ్మవార్లను పంచామృతాలతో అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్యకల్యాణాన్ని జరిపించారు. కొండపైన ఉన్న పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠ్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి. శ్రావణమాసం సందర్భంగా యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుపుకొనే సత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు.
రూ.1,20,27,394 యాదాద్రీశుడి హుండీల ఆదాయం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి 22 రోజు ల హుండీల ఆదాయం రూ.కోటి దాటిందని యాదాద్రి ఆలయ ఈవోగీత తెలిపారు. గురువారం యాదాద్రి కొండపై గల హరిత హో టల్లో హుండీలను లెక్కించామని, నగదు రూ. 1,20,27,394ఆదాయం వచ్చిందన్నారు. మిశ్ర మ బంగారం 310గ్రాములు, మిశ్రమ వెం డి నాలుగు కిలోల500 గ్రాములు వచ్చిందన్నారు.
స్వామివారి ఖజానాకు రూ.12,99,075 ఆదాయం
స్వామివారి ఖజానాకు రూ.12,99,075 ఆదా యం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ.2,38,402, రూ.100 దర్శనంతో రూ.95,000, నిత్యకైంకర్యాలతో రూ.1,200, సుప్రభాతంతో రూ.1,000, క్యారీబ్యాగులతో రూ.4,400, సత్యనారాయణ స్వా మివ్రతాలతో రూ.1,45,000 , కల్యాణకట్టతో రూ. 34,400, ప్రసాద విక్రయంతో రూ.5,06,505, వాహనపూజలతో రూ. 8,600, టోల్గేట్తో రూ.1,110, అన్నదాన విరాళంతో రూ.6,580, సువర్ణ పుష్పార్చనతో రూ.1,00,760, యాదరుషి నిలయంతో రూ. 67,360, పాతగుట్టతో రూ. 52,410 తో కలుపుకొని రూ.12,99,075 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.
ఆత్మకూరు(ఎం)లో ముగిసిన బోనాలు
ఆత్మకూరు(ఎం), సెప్టెంబర్ 2: మండల కేంద్రంలో వారం రోజుల పాటు మారెమ్మ, ముత్యాలమ్మ, కట్ట మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, సాగుబావి మైసమ్మ దేవతలకు నిర్వహించిన బోనాల ఉత్సవాలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. స్థానికులు గ్రామ దేవతలకు ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ జన్నాయికోడె నగేశ్, ఎంపీటీసీ కవిత, మాజీ సర్పంచ్ బీసు చందర్‌గౌడ్, ఉప సర్పంచ్ నవ్య, పీఏసీఎస్ చైర్మన్ శేఖర్‌రెడ్డి, రైతుబంధుసమితి జిల్లా డైరెక్టర్ ధనలక్ష్మి, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
చౌటుప్పల్‌లో ముత్యాలమ్మకు బోనాలు
మున్సిపాలిటీ కేంద్రంలో బోనాల పండుగ గురువారం ఘనంగా జరిగింది. మహిళలను పసుపు, కుంకుమలతో అలంకరించి ఊరేగింపుగా వెళ్లి ముత్యాలమ్మకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు మాట్లాడుతూ అమ్మవారిని భక్తితో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.
బొందుగులలో బోనాలు
రాజాపేట, సెప్టెంబర్ 2: బొందుగులలో గురువారం గౌడ కులస్తులు బోనా ల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మహిళలు డప్పుచప్పుళ్ల మధ్య బోనాలను ప్రదర్శనగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలమణీయాదగిరిగౌడ్, మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.