
దేశ రాజధానిలో తెలంగాణ భవన్ నిర్మాణానికి భూమి పూజ చారితాత్మకం. ఇటువంటి అపురూపమైన ఘట్టాన్ని ఆవిష్కరించి ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తినలో నవశకానికి నాంది పలికారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రత్యేక రాష్ట్రం కోసం హస్తినలో అహోరాత్రులు ఉద్యమ నాయకుడిగా పోరాడి విజయం సాధించిన సీఎం కేసీఆర్ స్వయంగా అదే ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు శంకుస్థాపన చేయడం టీఆర్ఎస్ పార్టీకి ఒక మైలు రాయి వంటిది.
యాదాద్రి, సెప్టెంబర్2: దేశ రాజధాని న్యూఢిల్లీలోని వసంత్‌విహార్‌లో సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గురువారం ఆయన భూమిపూజ నిర్వహించా రు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎన్డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.