
యాదాద్రి, సెప్టెంబర్1: టీఆర్ఎస్ జెండా పండుగ నేపథ్యంలో గురువారం మండల వ్యాప్తంగా ప్రతీవాడలో టీఆర్ఎస్ జెండాను రెప రెపలాడిస్తామని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కర్రె వెంకటయ్య తెలిపారు. బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలో ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలనుసారం జెండా పండుగకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని, ఉదయమే ప్రతి వార్డుల్లో టీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 3 నుంచి ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక జరుగుతుందన్నారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఆదేశాలనుసారం ప్రతి వార్డుల్లో టీఆర్ఎస్ ప్రధాన కమిటీతో పాటు యువజన, విద్యార్థి, మహిళా విభాగాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాంస్కృతి, కార్మిక, రైతు విభాగాల కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పార్టీలో నిబద్ధతతో పనిచేసే వ్యక్తులకు సముచితస్థానం ఉంటుందని అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంతో పాటు, మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ నూతన కార్యవర్గం ఎన్నికపై ఇన్చార్జిలను నియమించినట్లు వివరించారు. యాదగిరిగుట్ట పట్టణానికి కొండోజు ఆంజనేయులు, గూదె బాలనర్సింహా, మండలంలోని దొంతిరి సోమిరెడ్డి, పల్లె సంతోష్ ఇన్చార్జిలుగా వ్యవహరిస్తారని తెలిపారు. వీరితో పాటు మండలంలోని 24 మంది ముఖ్య నాయకులు సైతం గ్రామ, మండల కమిటీల ఎన్నుకునేందుకు సభ్యులుగా వ్యవహరిస్తారని వివరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మిట్ట వెంకటయ్య, సెక్రటరీ జనరల్ కసావు శ్రీనివాస్‌గౌడ్, ఎరుకల హేమేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
గుండాల, సెప్టెంబర్ 1: టీఆర్ఎస్ జెండా పండుగను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయా లనీ టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గడ్డమీది మహో దయ్గౌడ్ అన్నారు. గురువారం నిర్వహించే పార్టీ జెండా పండుగ సందర్భంగా ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని సూచించారు. టీఆర్ఎస్ దేశ రా జకీ యాలను శాసించే శక్తిగా ఎదుగుతుందని ఆయన అన్నారు.