
సత్తుపల్లి, జనవరి 22: కులమతాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మండల, పట్టణ పరిధిలోని 134 మంది లబ్ధిదారులకు రూ.1.34కోట్ల విలువైన చెక్కు లు, సొంత ఖర్చులతో చీరెలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేనివిధంగా ముఖ్యమంత్రి మదిలో మెదిలిన ఆలోచనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకే ఈ పథకం ఉపయోగపడుతున్నదన్నారు. ఇప్పటివరకు సత్తుపల్లి నియోజకవర్గంలో 8,500 మందికి రూ.80 కోట్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి సహకరించకుండా విమర్శలు చేస్తుంన్నదని ఆరోపించారు. ఏడేళ్ల పాలనలో ఒక్క హామీని నెరవేర్చలేదని, ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా ఉన్న ఘనత బీజేపీకే దక్కిందన్నారు. నిరుపేదలకు ఇళ్లస్థలాల విషయంలో ఈ నెల 24న అటవీశాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కరోనా, ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో ప్రభుత్వం జ్వర సర్వే చేపట్టి అనుమానితులకు మందులు అందజేస్తున్నదన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో మంత్రి హరీశ్‌రావుతో పట్టణంలో నిర్మించబోయే 100 పడకల ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన, అటవీశాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో అర్బన్ పార్కు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ సుజాత, డీటీ సంపత్‌కుమార్, గాదె సత్యం, చల్లగుళ్ల నర్సింహారావు, మల్లూరు అంకమరాజు, యాగంటి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ దాసరి వెంకట్రామిరెడ్డి, చెన్నారెడ్డి, వనమా వాసు, రమేశ్‌రెడ్డి, ఒగ్గు శ్రీనివాసరెడ్డి, కొడిమెల అప్పారావు, కంచర్ల నాగేశ్వరరావు, పెద్దిరాజు, చిలుకుర్తి కృష్ణమూర్తి, గాయం రాంబాబు, కొప్పుల నరేందర్‌రెడ్డి, రామ్మోహనరెడ్డి, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు ఘన సన్మానం
సత్తుపల్లి, జనవరి 22: గ్రామాభివృద్ధికి రూ.2కోట్లు నిధులు మంజూరు చేసి రహదారుల మరమ్మతులు, ఆధునీకరణ, అభివృద్ధి పనులు చేసినందుకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను శనివారం మండలంలోని గంగారం సర్పంచ్ మందపాటి శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపీపీ దాసరి వెంకట్రామిరెడ్డి(చిట్టినాయన), టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మాదిరాజు వాసు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే సండ్ర గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేసి అభివృది ్ధపథంలో నడిపించేందుకు తమకు సహాయ, సహకారాలు అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో రామగోవిందాపురం గ్రామకమిటీ అధ్యక్షుడు గాయం రాంబాబు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పెన్షనర్ల భవన నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు
సత్తుపల్లి రూరల్, జనవరి 22: సత్తుపల్లిలో పెన్షనర్ల భవన నిర్మాణ పనులు పూర్తిచేయించేందుకు రూ.5లక్షలు మంజూరు చేస్తున్నట్లు సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. పెన్షనర్ల డే సందర్భంగా శనివారం స్థానిక సంఘ కార్యాలయంలో జరిగిన పెన్షనర్ల సమావేశంలో విశ్రాంత ఉపాధ్యాయులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, హెల్త్‌కార్డులు కావాలనే ప్రతిపాదనను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అసెంబ్లీలో ఈ సమస్యను ప్రస్తావించి వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, కౌన్సిలర్లు అద్దంకి అనీల్, చాంద్‌పాషా, సంఘ అధ్యక్ష, కార్యదర్శులు చెంచురెడ్డి, కల్యాణం కృష్ణయ్య, మధుసూదన్‌రాజు, రామిశెట్టి సుబ్బారావు, ప్రకాష్‌రావు, కేశవరెడ్డి పాల్గొన్నారు.