కరీమాబాద్, ఏప్రిల్ 15 : ప్రస్తుతం వాహనాల వాడకం పెరిగింది. దీంతో వాటి టైర్లు పంక్చర్ అయినా రిపేర్ అయినా చేసే షాపులు కూడా పెరిగాయి. కానీ గతంలో వరంగల్‌లో వాహనం పంక్చర్ అయ్యిందంటే చాలు ప్రతి ఒక్కరికీ టక్కున గుర్తుకు వచ్చేది అండర్‌బ్రిడ్జి అడ్డా. పగలూ రాత్రి దాదాపు నిరంతరం అందుబాటులో ఉండే షాపు అదొక్కటే. శంభునిపేట రహమత్‌నగర్‌కు చెందిన మహబూబ్‌జానీ అలియాస్ జానీభాయ్ టైర్ల పంక్చర్లు అతకడంలో దిట్ట. ఆయన వయసు ప్రస్తుతం 65 ఏళ్లు. సుమారు 40 ఏళ్లుగా అక్కడ చిన్న పంక్చర్ షాపు పెట్టుకుని నడుపుతున్నాడు. తాను ఉపాధి పొందడంతో పాటు మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నాడు. అందరితో కలివిడిగా ఉంటాడు. పిల్లలు జీవితంలో స్థిరపడి, షాపు నిర్వహణ వద్దన్నా వినకుండా నేటికీ తన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి
ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. 36 పరుగులకే 3 వికెట్లు
ఉగాది వరకు ‘వకీల్ సాబ్’ 5 డేస్ కలెక్షన్స్