e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home జిల్లాలు నవయుగ వైతాళికుడు జ్యోతిరావు పూలే

నవయుగ వైతాళికుడు జ్యోతిరావు పూలే

నవయుగ వైతాళికుడు జ్యోతిరావు పూలే

భీమారం, ఏప్రిల్‌11: బడుగు, బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత, సామాజిక ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనలకు అందరం కృషిచేయాలని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కే పురుషోత్తం అన్నారు. ఆదివారం పూలే జయంతిని పురస్కరించుకుని యూనివర్సిటీ ఎస్డీఎల్‌సీఈ ప్రాంగణంలోని పూలే దంపతుల విగ్రహాలకు పురుషోత్తం, అధ్యాపకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేయూ బీసీ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పతంగి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పురుషోత్తం మాట్లాడారు. జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర పాఠ్యాంశాలుగా రావాల్సిన అవసరం ఉందన్నారు. కేయూ పాలకమండలి సభ్యుడు డాక్టర్‌ ఎం నాగేంద్రబాబు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో జ్యోతిరావు పూలే దంపుతుల విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్డీఎల్‌సీఈ డైరెక్టర్‌ వీరన్న, అధ్యక్షుడు ప్రొఫెసర్‌ మల్లికార్జున్‌రెడ్డి, ప్రొఫెసర్లు వల్లూరి రామచంద్రం, బన్న ఐలయ్య, వెంకయ్య, సంగని మల్లేశ్వర్‌, తాడూరి శాస్త్రి, నల్లాని శ్రీనివాస్‌, కొట్టే భాస్కర్‌, చిర్ర రమేశ్‌, సురేశ్‌గౌడ్‌ పాల్గొన్నారు.
సామాజిక స్ఫూర్తి ప్రదాత పూలే
సామాజిక సంస్కరణల స్ఫూర్తి ప్రదాత జ్యోతిరావు పూలే ఆశయాల సాధనకు కృషి చేస్తామని 57వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. హనుమాన్‌నగర్‌ జంక్షన్‌లో పూలే చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళుర్పించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు దూలం రాంబాబు, మొట్ల మనోహర్‌, వలస సారంగం, శ్రీనివాస్‌రెడ్డి, రఘుపతి, ఉదయ్‌, కిషన్‌ పాల్గొన్నారు.
పూలే అశయ సాధనకు కృషి చేయాలి
న్యూశాయంపేట : జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రొఫెసర్‌ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. హంటర్‌రోడ్డులోని మాజీ మంత్రి తక్కళ్లపల్లి పురుషోత్తంరావు నివాసంలో పూలే జయంత్యుత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో జనవేదిక సదస్సు కన్వీనర్‌ తక్కళ్లపల్లి రాము, డాక్టర్‌ ఆకుతోట శ్రీనివాసులు, సంజీవరెడ్డి, రంగారావు, సుధాకర్‌, కోట్టే భాస్కర్‌, గుండా అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు.
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి..
హన్మకొండ చౌరస్తా: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావుపూలే అని కొత్తూరు జేఏసీ కన్వీనర్‌ తాడిశెట్టి క్రాంతికుమార్‌ అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం, బుద్ధభవన్‌, మల్లయ్య హోటల్‌ వద్ద పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సాయం త్రం జైభీం సంకల్పయాత్ర నిర్వహించారు. కార్యక్రమం లో డాక్టర్‌ మధుసూదన్‌, వెంకటస్వామి, కొత్తూరు జేఏసీ నాయకులు తాడిశెట్టి రాజేశ్వర్‌రావు, కార్తీక్‌, అభినవ్‌, సంజయ్‌, సుప్రజ, వనజ, రవళి, అలేఖ్య, సుధీర్‌, అమర్‌, స్నిగ్ధ, అక్షయ్‌, మహేశ్‌, రఘు, కన్నీ పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి
మడికొండ: జ్యోతిరావు పూలేను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బైరి రవికృష్ణ అన్నారు. ఆదివారం ఫాతిమానగర్‌లోని వైష్ణవి గ్రాండ్‌లో సంఘం ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో పూలే జయంత్యుత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 50 మంది యువకులు రక్తదానం చేశారు. సంఘం రూరల్‌ జిల్లా అధ్యక్షుడు దాడి మల్లయ్య, అర్బన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల సంపత్‌కుమార్‌, సీనియర్‌ నాయ్యవాదులు తాళ్లపల్లి జనార్దన్‌, అంజయ్య, బీసీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎం అరుంధతి, నాయకులు హరికృష్ణ, మహేందర్‌, జే శ్రీనివాస్‌, మధు, జ్ఞానేశ్వర్‌, సురేశ్‌, కరణ్‌ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

పంజాబ్ కొవిడ్ -19 టీకా బ్రాండ్ అంబాసిడర్‌గా సోను సూద్

చాముండేశ్వరి దేవికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అభినందనలు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నవయుగ వైతాళికుడు జ్యోతిరావు పూలే

ట్రెండింగ్‌

Advertisement