హెచ్‌సీఏ అధ్యక్షుడి నియామకం చెల్లదు.. అమర్నాథ్ నియామకం చట్ట వ్యతిరేకం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా అమర్నాథ్ను నియమిస్తూ ఆ సంఘం అంబుడ్స్‌మన్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. అమర్నాథ్ నియామకం చట్ట వ్యతిరేకమని ప్రకటించింది.
- అంబుడ్స్‌మన్ ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు
- 45 రోజుల్లోగా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని ఆదేశం
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా అమర్నాథ్ను నియమిస్తూ ఆ సంఘం అంబుడ్స్‌మన్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. అమర్నాథ్ నియామకం చట్ట వ్యతిరేకమని ప్రకటించింది. అధ్యక్ష పదవికి 45 రోజుల్లోగా తిరిగి ఎన్నికలు నిర్వహించాలని హెచ్‌సీఏను ఆదేశించింది. అప్పటిదాకా ఉపాధ్యక్షుడికి అధ్యక్షుడి బాధ్యతలను అప్పగించాలని ఆదేశించింది. 2023లో జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో జగన్ మోహన్‌రావు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన అవినీతి ఆరోపణల కేసులో అరెస్టయ్యారు. దీంతో అధ్యక్ష పదవి ఖాళీగా ఉండటంతో, ఆ ఎన్నికల్లో కేవలం ఒక ఓటు తేడాతో ఓడిపోయిన అమర్నాథ్ను అధ్యక్షుడిగా నియమిస్తూ అంబుడ్స్‌మన్ ఫిబ్రవరి 2న ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నియామకాన్ని సవాల్ చేస్తూ సాగర్ క్రికెట్ క్లబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని జస్టిస్ యారా రేణుక సోమవారం విచారణ చేపట్టారు. ఎన్నికైన అధ్యక్షుడు అరెస్టు కావడం లేదా పదవి ఖాళీ కావడం వంటి పరిస్థితుల్లో గత ఎన్నికల ఓట్ల ఆధారంగా రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థిని అధ్యక్షుడిగా నియమించే అధికారం అంబుడ్స్‌మన్‌కు లేదని తేల్చారు. కాగా, హెచ్‌సీఏ కార్యదర్శి పదవి నుంచి తనను తొలగించడాన్ని సవాలు చేస్తూ దేవరాజ్ దాఖలు చేసిన మరో పిటిషన్ విచారణార్హమేనని అన్నారు. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని హెచ్‌సీఏకు నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

