వరంగల్, ఏప్రిల్ 14 : ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా కలెక్టర్ గోపి అధ్యక్షతన కే ఎంసీలోని ఎన్ఆర్ఐ ఆడిటోరియంలో వేడుకలను నిర్వహించారు. ఎంపీ పసునూరి దయాకర్, తూ ర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుం డు సుధారాణి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ముందుచూపుతో దళి త, బడుగు జీవుల హక్కులకు రాజ్యాంగలో ప్రాధాన్యమిచ్చారన్నారు.
ఎమ్మెల్యే నన్నపునేని మాట్లాడు తూ.. సమానత్వ సమాజ నిర్మాణం కోసం రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ఆదర్శప్రాయుడన్నారు. ఉర్సు గుట్ట వద్ద నిర్మించనున్న అడిటోరియానికి అంబేద్కర్ పేరు పెడుతామన్నారు. మేయర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ.. కుల వివక్షను రూ పుమాపడానికి ఆయన చేసిన కృషి అజరామరమన్నారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు నగదు పురస్కారాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కులాంతర వివాహం చేసుకున్న 16జంటలకు ఒక్కొక్కరికి రూ. 2.50లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ శ్రీవత్స, వరంగల్ ఏసీపీ గిరికుమార్, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, దుగ్గొండి మండలం నాచినపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అర్జున్ బీఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను పూసగుచ్చినట్లు వివరించగా, అక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు చిన్నారిని సత్కరించారు.
కాశీబుగ్గ : బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను గురువారం కాశీబుగ్గ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. వివిధ పార్టీలు, దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ.. డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలన్నారు. వరంగల్ జిల్లా ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్‌ను ఒప్పించామని, అజాంజాహి మిల్లు ప్రాంతంలో నూతన కలెక్టరేట్ నిర్మాణానికి 20 ఎకరాల స్థలం మంజూరు చేయించినట్లు తెలిపారు.
కాశీబుగ్గ జంక్షన్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. సమాజంలో అందరూ సమానులే అని, ఎవరూ తక్కువ కాదని తెలిపిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. కలెక్టర్ బీ గోపి, అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, జడ్పీ సీఈవో రాజారావు, వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్లు గుండేటి నరేంద్రకుమార్, ఓని స్వర్ణలతాభాస్కర్, బాల్నె సురేశ్, వస్కుల బాబు, భోగి సువర్ణ తదితరులు పాల్గొన్నారు.