అధికారుల సూచనలతో అధిక దిగుబడులు సాధించాలి
అర్హులైన అందరికీ డబుల్బెడ్రూం ఇండ్లు
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి
రూ.81లక్షలతో భూసార పరీక్ష భవన నిర్మాణానికి శంకుస్థాపన
నియోజవర్గంలో కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
వనపర్తి రూరల్, ఆగస్టు18: రైతులకు మేలు రకమైన పంటల సాగుకు భూసార పరీక్ష కేంద్రం మరింత తోడుగా నిలువనున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం నాగవరం శివారులో వ్యవసాయ భూసార మట్టి నమూనాల పరీక్ష కేంద్రం భవనానికి ఎమ్మెల్సీ వాణీదేవి, జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సిద్దిపేట, సిరిసిల్లతోపాటు వనపర్తికి సీఎం కేసీఆర్ భూసార పరీక్షా కేంద్రాలను మంజూరు చేశారన్నారు. భూసారాన్ని బట్టి అధికారుల సూచనలు, సలహాలతో పంటలు సాగు చేసుకొని అధిక దిగుబడులను సాధించాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండలంలోని రహదారుల వెంట అవసరం ఉన్న చోట బ్రిడ్జిల నిర్మాణాలు చేపడ్తామన్నారు. మండలంలోని నాచహళ్లి గ్రామంలో బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
గోపాల్పేట, ఆగస్టు18: మండలంలో పలు అభివృద్ధి పనులకు బుధవారం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. స్థానిక తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో ఉమ్మడి మండలంలోని లబ్ధిదారులకు మంత్రి చేతులమీదుగా కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ముందుగా పాటిగడ్డతండా, వెంకటాపురం మధ్య గుడ్డిమోత వాగుపై పీఎంజీఎస్‌వై నిధులు రూ. కోటీ 28లక్షలతో చేపట్టే వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బుద్ధారం పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి ధర్మతండా వరకు ఎస్టీఎస్డీఎఫ్ నిధులు రూ.66లక్షలతో నిర్మించతలపెట్టిన కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాటిగడ్డతండాలో గుండె పోటుతో మృతి చెందిన చంద్రానాయక్, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గోవింద్ నాయక్ కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి చిన్న పిల్లలకు న్యూమోకోకల్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దవాఖానలో సిజెంట్ కంపెనీ సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన పది నూతన బెడ్లను ప్రారంభించి, దవాఖాన ఆవరణలో కలెక్టర్‌తో కలిసి మొక్కలు నాటారు. ఉమ్మడి మండలంలో 140మంది లబ్ధిదారులకు రూ.కోటి42లక్షల 16,472 విలువగల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, 15మందికి సీఎం సహాయ నిధి చెక్కులను తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో మంత్రి అందజేసి, లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి
పెబ్బేరు, ఆగస్టు18: జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని జూరాల కాలువ సమీపంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద జర్నలిస్టుల డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలకు ఎమ్మెల్సీ సురభి వాణీదేవితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి జర్నలిస్టుకు సొంతింటి కలను త్వరలోనే విడుతల వారీగా నెరవేర్చేందుకు రాష్ట్ర సర్కార్ కృషి చేస్తుందన్నారు.
రోడ్డు పనులు ప్రారంభం
రేవల్లి, ఆగస్టు18: స్వరాష్ట్రంలో తండాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పంచాయతీలుగా మార్చి మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని పాతతండా నుంచి తల్పునూర్ తండావరకు రూ.2కోట్ల 9లక్షల వ్యయంతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను మంత్రి బుధవారం ప్రారంభించారు.
పెబ్బేరు మండలంలో..
పెబ్బేరు రూరల్, ఆగస్టు18: దేశంలో ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణలో జరిగినంత అభివృద్ధి జరిగిందని ఎవరైనా నిరూపిస్తే వారి ముందే ముక్కు నేలకు రాస్తానని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సవాల్ విసిరారు. పెబ్బేరు మండలంలో సూగూరులో రోడ్డు నిర్మాణానికి భూమి పూజ, కొత్తసూగూరు, బూడిదపాడుల్లో వైకుంఠధామాల ప్రారంభోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. వ్యవసాయరంగంపై ఏటా రూ.60వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు.
చెక్కులు పంపిణీ
పెబ్బేరు, ఆగస్టు18: స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణంలో మంత్రి నిరంజన్‌రెడ్డి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. పెబ్బేరు మండలం 131, శ్రీరంగాపూర్ మండలానికి చెందిన 54మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జిల్లా వైద్యాధికారి చందూనాయక్, జిల్లా వ్యవసాయశాఖాధికారి విజయ్‌భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ కరుణశ్రీ, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కర్రెస్వామి, జెడ్పీటీసీలు భార్గవి, బోర్లభీమయ్య, పద్మ, ఎంపీపీలు సంధ్య, శైలజ, కిచ్చారెడ్డి, సేనాపతి, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, తాసిల్దార్ నరేందర్, ఎంపీడీవో కరుణశ్రీ, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ హర్యానాయక్, ఏఈ నాగేంద్రకుమార్, డీఈ నరేందర్‌కుమార్, సింగిల్ విండో అధ్యక్షుడు రఘు యాదవ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు తిరుపతియాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాల్‌రాజు, పీఆర్‌ఈఈ మల్లయ్య, డాక్టర్ మంజుల, శ్రావణి, సర్పంచులు పద్మమ్మ, శ్రీనివాసులు, శేఖర్ యాదవ్, శంకర్‌నాయక్, ఎంపీటీసీలు కేతమ్మ, శ్రీదేవి, ధర్మానాయక్, శాంతి కోఆప్షన్ సభ్యులు ఎండీ మతీన్, టీఆర్ఎస్ నాయకులు రామారావు, భాస్కర్, కోళ్ల వెంకటేశ్, కర్రెస్వామి, నవీన్ కుమార్‌రెడ్డి, కోటీశ్వర్‌రెడ్డి, శ్రవణ్, కోదండం, నాగరాజు, శివ, వెంకటయ్య, బుచ్చారెడ్డి, కురుమూర్తి, వెంకటేశ్, సాయినాథ్, పూల్యానాయక్, రాజు, ఆశన్ననాయుడు, నర్సింహ, విష్ణుయాదవ్, మనోహర్‌సాగర్, వెంకటయ్య పాల్గొన్నారు.