వనపర్తి, సెప్టెంబర్ 29 : ఏడాదిలోగా నార్లాపూ ర్, ఏదుల, వట్టెం, కర్వెన రిజర్వాయర్లకు నీళ్లు ఇ చ్చేలా పనుల్లో వేగం పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో వైద్య, ఆరోగ్య, సాగునీటి పారుదల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు శరవేగంగా జరుగుతున్నాయని, సా గునీటి పారుదల, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కాలువల కోసం ప్ర భుత్వం సేకరించిన భూమి పరిధిని గుర్తించి రాళ్లు నాటాలని, పనుల్లో ఉపాధి హామీ కూలీలు, వీఆర్వో, వీఆర్ఏలను సాగునీటి శాఖ ఏఈలకు అనుసంధానం చేయాలన్నారు. ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షణ పెంచాలని, క్షేత్రస్థాయి సమస్యలను గుర్తించి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. సీఈ కార్యాలయ కార్యకలాపాల ను వనపర్తి నుంచి ప్రారంభించాలని, ఉపాధి హామీ లో కాల్వల పూడిక తీత చేపట్టాలని గతంలోనే అధికారులకు చెప్పామని, పర్యవేక్షణ లోపంతో అనుకున్నంత పనులు జరగడం లేదన్నారు.తూములు, కాల్వలను సరి చేయడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, కాల్వల పూడికతీత సమయంలో ఏఈలు, డీఈలు కచ్చితంగా పర్యవేక్షించాలని సూ చించారు. వనపర్తి జిల్లాలోని 11 చెక్‌డ్యాంల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, శ్రీరంగాపురం మండల కేంద్రంలోని రంగ సముద్రం రిజర్వాయర్ ఎప్పుడూ నిండుగా ఉండేలా చొరవ తీసుకోవాలన్నారు. కాల్వలకు నీళ్లు విడుదల చేయాలని ఆదేశించారు. వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని మినీ ఎత్తిపోతల పథకాల వాస్తవ పరిస్థితిని క్షేత్రస్థాయిలో పర్యటించి.. నాలుగు రోజుల్లో నివేదిక అందజేయాలన్నారు. ఘణపురం బ్రాంచ్ కెనాల్‌పై వయోడెక్ట్, స్ట్రక్చర్లు పూర్తి కావాలని, కమాలొద్దీన్‌పూర్ డిస్ట్రిబ్యూటరీపై ఓటీని నిర్మించాలని, మామాడిమాడ రిజర్వాయర్ పనుల విషయంలో ఏజెన్సీలతో చ ర్చించాలని, కర్నెతండా లిప్ట్ టెండర్లు వెంటనే పిలవాలన్నారు. ఎంజీకేఎల్ఐ కింద ఆన్లైన్ రిజర్వాయర్ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని, డిస్ట్రిబ్యూటరీ కాల్వలన్నీ వీటికి అనుసంధానించాలన్నారు. బుద్ధ్దారం కుడి కాల్వ డిస్ట్రిబ్యూటరీకి టెండర్లు పిలిచి స్ట్రక్చర్లు పూర్తి చేయాలని, కేఎల్ఐ ప్రధాన కాలువ కింద అధిక ఆయకట్టు ఉన్న డీ-8పై ఎంజే 1, 2, 3, 4, 5, 8లలో మట్టి తీసే పనులు పెండింగ్‌లో ఉన్నాయని, తక్షణమే వాటిని పూర్తి చేయించాలని సూచించారు. డీ-8 కాలువ షెట్టర్ సరిచేయాలని, రాంరెడ్డిపల్లి తండా వద్ద పైపులు వేయించాలని, పాన్‌గల్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పూర్తి చేయాలన్నారు.
వనపర్తి జిల్లాలో 169 సెంటర్లతో 54 శాతం వ్యాక్సినేషన్ చేపట్టామని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. 4.25 లక్షల మందికి గానూ 2.25 లక్షల మందికి మొదటి, 56 వేల మందికి రెండో డోస్ వే శారన్నారు. వైద్యుల కొరత లేకుండా చూడాలని, ఉద్యోగులతో ప్రేమతో పని చేయించుకోవాలని, ఆ జమాయిషీ చెలాయించొద్దని అధికారులకు సూచించారు. మెడికల్ కళాశాల కోసం 80 బెడ్లను అదనం గా మంజూరు చేయించామన్నారు. అప్పాయిపల్లి మాతా శిశు సంరక్షణ కేంద్రంలో అదనపు అంతస్తు నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి కోరుతున్నట్లు తెలిపారు. అంతకుముందు ఆజాదికా అమృతోత్సవ్‌లో భాగంగా సత్యాగ్రహ్ సే స్వచ్ఛాగ్రహ్ రథయాత్రను నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, జెడ్పీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, సీఈలు హమీద్‌ఖాన్, రఘునాథరావు, డీఎంహెచ్‌వో చందూనాయక్, ఎస్ఈలు విజయభాస్కర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, సత్యశీలారెడ్డి, ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి..
గద్వాల, సెప్టెంబర్ 29 : జోగుళాంబ గద్వాల జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని మంత్రి నిరంజన్‌రెడ్డి వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య, ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల బా రిన పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్టు పనుల్లో నిర్లక్ష్యం వహించకుండా, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చూడాలన్నారు. చివరి ఆయకట్టుకు నీరందేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. జి ల్లాలో 4.22 లక్షల మందికిగానూ ఇప్పటివరకు 2.12 లక్షల మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. వ్యాక్సినేషన్ మందకొడిగా ఉన్న ప్రాంతాల్లో సాంస్కృతిక కళాకారులతో అవగాహన కల్పించాలని సూచించారు. జూరాల, నెట్టెంపాడ్, తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ల కింద ఉన్న రిజర్వాయర్లకు డీపీఆర్ తయారు చేసి.. మీ పరిధిలో ఉన్న పనులను ఎమ్మెల్యేతో చర్చించి పూర్తి చేయాలని ఆదేశించా రు. అధికారులు సైట్‌కు వెళ్లి సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు. ఏఈలు వారి పరిధిలో ఉన్న కాలువలు పరిశీలించి వాటి మరమ్మతులు చేయించాలన్నారు. యాసంగిలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసేలా వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారులతో వారానికోసారి రివ్యూ ఏర్పాటు చేసి పెండింగ్ పనులు పూర్తయ్యేలా చూస్తామన్నారు. సమావేశంలో ఎంపీ రాములు, జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, అదనపు కలెక్టర్లు రఘురాంశర్మ, శ్రీహర్ష, డీఎంహెచ్‌వో చందూనాయక్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఇరిగేషన్ అధికారులు రఘునాథ్‌రావు, శ్రీనివాసులు, రహిముద్దీన్, జూబేర్ తదితరులు పాల్గొన్నారు.