ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
ఆత్మకూరు, ఆగస్టు 20: సులభతర పాలనే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆత్మకూరు నూతన మున్సిపాలిటీ భవనం ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ప్రజలకు సులభతర, సూపరిపాలన అందించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. స్వరాష్ట్ర సాధన, జిల్లాల పునర్వవ్యస్థీకరణ, మండల్లాల ఏర్పాటు ఈ దిశలోనే చేసినట్లు ఆయన చెప్పకొచ్చారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండి మెరుగైన పాలన అందించేందుకే నూతన కార్యాలయ భవనాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యంగా మున్సిపల్ కార్యాలయం విధులు నిర్వహించాలని కమిషనర్ రమేశ్‌కు సూచించారు. అంతకుముందు మున్సిపాలిటీ పాలకసభ్యులు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా ప్రారంభానికి విచ్చేసిన ఎమ్మెల్యేను పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కౌన్సిల్ సభ్యులు, కొత్త భవనంలోకి మున్సిపాలిటీ కార్యాలయం మారిన నేపథ్యంలో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కౌన్సిల్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ కోటేశ్వర్, జెడ్పీటీసీ శివరంజని, మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రీయాదవ్, వైస్‌చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్లు కృష్ణమూర్తి, లక్ష్మీకాంత్‌రెడ్డి, రైతుబంధు సమితి నాయకులు వీరేశలింగం, పార్టీ అధ్యక్షుడు రవికుమార్‌యాదవ్, మాజీ ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, మున్సిపల్ కౌన్సిర్లు, కోఆప్షన్ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు.
‘ప్రాణభయం’ షార్ట్‌ఫిల్మ్ షూటింగ్ ప్రారంభం
ఆత్మకూరు కళాకారులచే నిర్మిస్తున్న షార్ట్ ఫిల్మ్ ‘ప్రాణభ యం’ షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. స్థానిక అష్టలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. నేటి సామాజిక పరిస్థితులను ప్రతిబింభించేలా షార్ట్‌ఫిల్మ్‌లు రూపొందుతున్నాయని, ఆ త్మకూరు కళాకారుడు బాలు షార్ట్‌ఫిల్మ్‌లతో ఎంతో ప్రజాధరణ పొందారని ఎమ్మెల్యే అన్నారు. ఈ షార్ట్‌ఫిల్మ్‌కు కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, డైరెక్షన్ బాలు నిర్వహించనున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉదయ్‌కిరణ్, సాయి, నటీనటులుగా చిన్నారి సాహితి, సహస్ర కొమురక్క బృందం, రాజేశ్, అలీమ్, సాకేత్, మల్లేశ్‌గౌడ్, తులసి, రామ్, రాజేశ్, అబ్దు ల్లా, ఇంతియాజ్, నవాజ్, దేవా, కెమెరామెన్‌గా కరుణాకర్ పనిచేస్తున్నారని బాలు తెలిపారు. కార్యక్రమంలో ఎం పీపీ శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ కోటేశ్వర్, చైర్పర్సన్ గాయత్రీయాదవ్, వైస్‌చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు రవికుమార్‌యాదవ్, మాజీ ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, సీఐ సీతయ్య, ఎస్సైలు రాఘవేందర్, ప్రవీణ్‌కుమార్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.