ఘనంగా ఫొటోగ్రఫీ దినోత్సవం
లూయిస్ డాగూరే చిత్రపటం వద్ద ఫొటో, వీడియో గ్రాఫర్ల నివాళి
ఊట్కూర్, ఆగస్టు 19 : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకలను గురువారం మండలకేంద్రంలో ఫొటో, వీడి యో గ్రాఫర్లు ఘనంగా నిర్వహించారు. స్థానిక వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో ఫొటోగ్రాఫర్ పితామహుడు లూయిస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫొటోగ్రఫీ యూనియన్ అధ్యక్షుడు చౌద్రి అశోక్‌కుమార్ మాట్లాడుతూ తీపి జ్ఞాపకాలను కండ్లకు చూపించే ఫొ టోగ్రాఫర్లను ప్రభుత్వం గుర్తించి ఉద్యోగ, ఉపాధి అవకా శాలను కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఫొటో, వీడియో గ్రఫీ యూనియన్ నాయకులు రాము, శంకర్‌రెడ్డి, మోనేశ్, నరేశ్, శ్రీను, గురునాథ్ పాల్గొన్నారు.
మధుర క్షణాలను పదిలంగా దాచుకోవాలి
మక్తల్ టౌన్, ఆగస్టు 19 : మధుర క్షణాలను ఫొటోగ్రఫీ ద్వారా పదిలంగా దాచుకోవాలని ఎస్సై రాములు అన్నారు. పట్టణంలోని పడమటి ఆంజనేయ స్వామి ఆలయం ఆవరణలో ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్సై రాములు ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగూ రే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఫొటో సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నదని తెలిపారు. అదేవిధంగా అసోసియేషన్ స భ్యుడు శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఫొ టోగ్రాఫర్ లేనిదే ఏ కార్యక్రమం చేపట్టాలేరని పేర్కొన్నారు. ఫొటో గ్రాఫర్లను ప్రభుత్వం ఆదుకోవాలని, నియోజకవర్గ కేంద్రంలో ఫొటోగ్రాఫర్లకు భవనం కోసం స్థలం కేటాయించాలన్నారు. కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఫొటో యూనియన్ ఆధ్వర్యంలో …
నారాయణపేట టౌన్, ఆగస్టు 19 : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పట్టణంలోని ఫొటో యూనియన్ ఆధ్వర్యం లో ఘనంగా జరుపుకొన్నారు. ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగూరే చిత్రపటానికి పూలమాల వేసి నివాళు లర్పించారు. కార్యక్రమంలో సీనియర్ ఫొటోగ్రాఫర్ సోలాపూర్ రాము, యూనియన్ అధ్యక్షుడు రఘుబాబు, శివశా రి, అంబదాస్, నర్సింగ్, కిశోర్, రాజు, వినోద్, నాగరాజ్, సిరాజ్, రాజుఘట్ తదితరులు పాల్గొన్నారు.
ఫొటోగ్రఫీ మండల సంఘం ఆధ్వర్యంలో…
నర్వ, ఆగస్టు 19 : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని మండల ఫొటోగ్రఫీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లూయిస్ డాగూరే చిత్రపటానికి పూలమాల వే సి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీనియర్ ఫొటోగ్రాఫర్ గోకూల్సింగ్, ఫొటోగ్రాఫర్లు భాస్కర్‌రెడ్డి, నవీన్‌కుమార్, ఆంజనేయులు, అంజీ, రవీందర్‌సింగ్ తదితరులుపాల్గొన్నారు.