ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
అధికారులు కాల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి
మక్తల్ టౌన్, ఆగస్టు 19 : మక్తల్ నియోజకవ ర్గ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాన ని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గు రువారం ఎమ్మెల్యే నివాసంలో నీటి పారుదల శా ఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల కురిసిన అధిక వర్షాలకు అక్కడక్కడ చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయర్ మెయిన్ కెనాల్‌కు గండ్లు పడడంతో వాటిని పూడ్చడం చేశామని, ఇరిగేషన్ అధికారు లు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని తెలిపా రు. నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించేందుకు ఫేస్ 1లోని స్టేజ్ 1ను రెండు రోజూల్లో పం పింగ్ చేయిస్తామని, తదనంతరం స్టేజ్ 2ను ప్రా రంభిస్తామని, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయర్ ద్వారా ని యోజకవర్గంలోని మండలాల పరిధిలో దాదాపు లక్ష 20 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. దాదాపు వంద చెరువులు నింపడం జరిగిందని, ఆ యకట్టు రైతులకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల పట్ల ముందుచూపుతో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈ ఈ సంజీవ్ప్రసాద్, డీఈ వెంకట్రామ ణ, ఏఈ నాగశివ, విజయ్‌భాస్కర్, శివానంద్, మోహన్, సయ్యద్ పాల్గొన్నారు.
మున్సిపాలిటీ ఎంట్రన్స్ బోర్డ్ ఏర్పాటు
మక్తల్ మున్సిపాలిటీ ప్రవేశ బోర్డు ఏర్పాటుకు దండు క్రాస్ వద్ద, మరొకటి రాయచూర్ రోడ్డు లో ని చందాపూర్ వద్ద ఏర్పాట్లకు ఎమ్మెల్యే స్థలం పరిశీలించారు. వాటి నిర్మాణ ఏర్పాటుకు ఇప్పటికే రూ.24 లక్షలు కేటాయించామన్నారు. టెండర్లు కూడా పూర్తి అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. త్వరగా వాటిని ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏఈ నాగశివ, శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.