పెన్ లేదా కుంచె పట్టాడంటే చాలు అక్షరాలను ఉత్పత్తి చేసే కళాకారుడు.. ప్రాచీన భారతీయ కళకు ప్రాణం పోసేలా లిపిని ముద్రాక్షరాలుగా తీర్చిదిద్దుతున్న ప్రతిభావంతుడు.. విభిన్న కోణాల్లో, కళాకృతుల్లో నవ‘కాంతులు’ నింపుతూ మన్ననలు పొందుతున్నయువకుడు.. ఆత్మకూరుకు చెందిన నవకాంత్ కాలిగ్రఫీలో రాణిస్తున్నాడు. ఇప్పటికే పలు దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. అతడి కళాకృతులకు మంచి ఆదరణ లభించింది.
ఆత్మకూరు, ఆగస్టు 14 : స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు కావస్తున్న నేపథ్యంలో కాలిగ్రఫీ కళాకారు లు దేశ ఐక్యతను చాటుతున్నారు. అరుదైన ప్రాచీన కళగా గుర్తింపు పొందిన ‘కాలిగ్రఫీ’తో పంద్రాగస్టు వేడుకలకు స్వేచ్ఛా కాంతులను ప్రసరింపజేస్తున్నా రు. ఆగస్టు 11 నుంచి 15 వరకు జరుపుకొనే కాలిగ్రఫీ దినోత్సవ మహోత్సవాల్లో భాగంగా ప్రతి ఏ డాది తమ కళను ప్రదర్శిస్తున్నారు. ఈ ఏడాది కరో నా కష్టకాలంలో అండగా నిలిచిన ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ‘జైహింద్’ పలికారు. మన వేదభూమి గొప్పదనాన్ని చాటేలా ‘జైహింద్’ అని ఆలపిస్తూ దేశ ఔన్నత్యాన్ని చిన్న గేయం రూపంలో ప్రదర్శించారు. 35 మంది కళాకారులతో 17 భాషల లిపిని ప్రచురించి ఆలపించిన ఈ గేయాన్ని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ ఆవిష్కరించారు. అందమైన భారతీయ లిపిలను, అజేయమైన భారతీయ స్ఫూర్తిని ప్రదర్శిస్తూ రూపొందించిన ఈ వీడియోలో తెలుగు లిపిని ఆత్మకూరు యువకుడు ప్రచురించాడు. తెలు గు రాష్ర్టాల నుంచి కాలిగ్రఫీ కళలో అంతర్జాతీయం గా గుర్తింపు పొందిన ఏకైక యువకుడు ఆత్మకూరు పట్టణానికి చెందిన కరిడె
వనపర్తి జిల్లా ఆత్మకూరుకు చెందిన కట్టెలమండి రాములు కుమారుడు కరిడె నవకాంత్ చిన్నప్పటి నుంచి ప్రత్యేక దస్తూరిని రాయడంలో గుర్తింపు పొందాడు. నోటు పుస్తకాలపై పేర్లు రాయడం మొద లు తన ప్రత్యేకతను చాటుతూ పాఠశాల స్థాయిలో నే అందరినీ ఆకర్షించేవాడు. తాను రాస్తున్న ప్రత్యేక దస్తూరీ ‘కాలిగ్రఫీ’ కళను పోలి ఉందని గుర్తించాడు. అక్షరాలను ముద్రాక్షరాలుగా అందంగా రా సే లిపినే కాలిగ్రఫీ అంటారు. దీంతో కాలిగ్రఫీలో ప్రాచుర్యం సాధించేందుకు ముంబై వెళ్లాడు. అచ్యు త్ పాలవ్తో శిష్యరికం చేసి మెళకువలు, నైపుణ్యత సాధించాడు. నాటి నుంచి కాలిగ్రఫీ కళను అధునికీకరించి విభిన్న రూపాల్లో, కళాకృతులను ప్రదర్శించడంలో మేటిగా నిలిచాడు.
ప్రాచీన భారతీయ కళకు ప్రాణం పోసేలా లిపిని ముద్రాక్షరాలుగా తీర్చిదిద్దడమే కాకుండా విభిన్న కోణాల్లో, కళాకృతుల్లో కళను ప్రదర్శించడంలో నవకాంత్ అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. జాతీ య, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రదర్శనలు ఇ స్తూ కళకు ప్రాచుర్యాన్ని కల్పిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ముంబై, ఢిల్లీ, సౌత్‌కొరియా, నెదర్లాండ్ దేశాల్లో ఇప్పటికే పలు ప్రదర్శనలిచ్చి మంచి ఆదరణ సంపాదించాడు. రాష్ట్రంలోనూ ఈ కళకు ప్రా ముఖ్యత కల్పించేలా ప్రభుత్వం కృషిచేయాలని కోరుతున్నాడు. ఈ ఏడాది స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకొని ప్రత్యేకంగా కళానీరాజనాలు ప్రదర్శిస్తున్నాడు. మన జాతీయగీతం ‘జనగణమన’ను వివిధ కళాకృతులతో ప్రచురించి దేశభక్తిని చాటుకున్నాడు. వివిధ రాష్ర్టాలోని కళకారులు ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకలకు నీరాజనం పలికే యూట్యూబ్ వీడియోను https://youtu.be/ouLXK8MZNV8 లింక్ ద్వారా వీక్షించొచ్చు.