కొడంగల్/ బొంరాస్‌పేట, సెప్టెంబర్ 18: మం డలంలోని పలు గ్రామాలు, తం డాలలో శనివారం గణేశ్ నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. చవితి పండుగనాడు పలుచోట్ల ప్రతిష్టించిన గణనాథులకు తొమ్మిది రోజులపాటు ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉదయం మండపాలలో లడ్డూలు, ప్రసాదాలకు నిర్వాహకులు వేలం వేయగా భక్తులు పోటీలు పడి దక్కించుకున్నారు. అనంతరం వాహనాలను అందంగా అలంకరించి గణనాథులను ఉంచి ఉత్సాహంగా ఊరేగిం పు నిర్వహించారు. పొద్దుపోయిన తరువాత చెరువులు, కుంటల్లో గణనాథులను నిమజ్జనం చేశారు. కొడంగల్ సన్‌సిటీ కాలనీలో వెలసిన వినాయకుడిని నిమజ్జన చేసేందుకు శ్రీశైలానికి తీసుకెళ్లారు.
పెద్దేముల్లో ప్రశాంతంగా …
పెద్దేముల్, సెప్టెంబర్ 18 : మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామా ల్లో శనివారం వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. ముఖ్యం గా మండల కేంద్రంతోపాటు జనగాం, మారేపల్లి,రుద్రారం తదితర గ్రా మాల్లో వినాయక నిమజ్జనాన్ని ఆయా గ్రామాల ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. శనివారం రాత్రి ఆటపాటలతో గ్రామాల్లోని ప్రధాన వీధుల గుండా వినాయక విగ్రహాలను ఊరేగిం పుగా తీసుకెళ్ళి కోట్‌పల్లి ప్రాజెక్టులో నిమజ్జనం చేశారు. మరికొందరు స్థానికంగా ఉన్న చెరువులు, కుంటలలో వినాయకులను నిమజ్జనం చేశారు. వినాయక నిమజ్జనం నేపథ్యంలో పెద్దేముల్ మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో తాండూరు డీఎస్పీ లక్ష్మీ నారాయణ,రూరల్ సీఐ జలెంధర్ రెడ్డి ,స్థానిక ఇన్చార్జి ఎస్ఐ విశ్వజన్లు నిమజ్జనంలో భాగంగా సుమారు 40 మంది పోలీసులు, ముగ్గురు ఎస్ఐలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
పూడూరు మండలంలో..
పూడూరు, సెప్టెంబర్ 18: మండల పరిధిలోని పలు గ్రామాల్లో వినాయక నిమజ్జనాలకు ముందు నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు గణపయ్య చేతిలో పూజలు అందుకున్న లడ్డుతో పాటు ఇతర వస్తువులను వేలం పాటలో పలువురు యువకులు దక్కించుకున్నారు.
కోట్‌పల్లి, మొమిన్‌పేట్ మండలాల్లో
కోట్‌పల్లి/ మొమిన్‌పేట్, సెప్టెంబర్ 18: మండల కేంద్రాలతో పాటు ఆయా పంచాయతీల్లోని గ్రామాల్లో కొలువు దీరిన గణనాథులు కోట్‌పల్లి, మొమిన్‌పేట్ ప్రాజెక్టుల్లో నిమజ్జనం చేశారు. అంతకు ముందు అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. మండలంలోని రాంపూర్‌లో కొలువు దీరిన వినాయకుడి లడ్డూలను వేలం పాటలో బేగరి ఆనందం 30 వేలకు, బేగారి జ్ఞానేశ్వర్ 10వేలకు, బేగ రి లక్ష్మణ్ 8500లకు దక్కించుకున్నారు.