e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 24, 2022
Home జిల్లాలు ప్రభుత్వ పథకాలు దేశానికి ఆదర్శం

ప్రభుత్వ పథకాలు దేశానికి ఆదర్శం

  • బంగారు తెలంగాణ సారధి సీఎం కేసీఆర్‌
  • టీఆర్‌ఎస్‌ బలోపేతానికి సమష్టిగా కృషి చేద్దాం
  • రానున్న రోజుల్లో కమిటీలకు ప్రాధాన్యత
  • రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్‌

కొడంగల్‌, సెప్టెంబర్‌ 17 : బంగారు తెలంగాణ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ సారధిగా ఎనలేని కృషి చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్‌ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో కొడంగల్‌, బొంరాస్‌పేట నూతన మండల కమిటీతో పాటు అనుబంధ కమిటీ ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు అంబేద్కర్‌ కూడలిలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి టీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, గ్రామ కమిటీ ఎన్నికలను పూర్తి చేసుకొని మండల, అనుబంధ కమిటీ ఎన్నికలను నిర్వహించుకుంటున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల వారిని సమన్వయం చేస్తూ గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీను ఏర్పాటు చేసే దిశగా సీఎం కేసీఆర్‌ ఆదేశాలను జారీ చేసినట్లు పేర్కొన్నారు. నూతన కమిటీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, విద్యా, ఐటీ విభాగం వంటి 9 అనుబంధ కమిటీలను ఎన్నుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. తెలంగాణలో ఐటీ శాఖ భేష్‌గా ఉందని కితాబు ఇచ్చిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు శశిథరూర్‌ను అదే పార్టీకి చెందిన ఈ మధ్య కాలంలోనే పార్టీలో చేరి కొత్తగా పీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్‌రెడ్డి హేళనగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పాదయాత్రలతో ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని, స్వలాభం కోసం ఉనికిని చాటుకునేందుకు పాదయాత్రలు చేస్తున్నట్లు ఎద్దేవా చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ వంటి తదితర రాష్ర్టాలకు అధిక నిధులు అందిస్తూ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ వంటి రాష్ర్టాలకు నిధులు ఇవ్వకుండా కేంద్రం కట్టడిచేస్తున్నట్లు ఆరోపించారు. అదేవిధంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా లక్షా 50వేల ఎకరాలకు సాగునీరు అందేలా ప్రాజెక్టును డిజైన్‌ చేసినట్లు తెలిపారు. త్వరలో టెండర్‌ ప్రక్రియను పూర్తి చేసి సంవత్సరకాలంలో పూర్తి చేయనున్నట్లు చెప్పారు. మున్సిపల్‌ అధ్యక్షుడిగా మాజీ సర్పంచ్‌ రమేష్‌బాబును ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్‌, కొడంగల్‌, బొంరాస్‌పేట మండలాల టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లుతో పాటు సతీష్‌ముదిరాజ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

పార్టీలో ప్రతి ఒక్కరికీ గుర్తింపు

దౌల్తాబాద్‌/బొంరాస్‌పేట, సెప్టెంబర్‌ 17 : టీఆర్‌ఎస్‌ పార్టీలో పని చేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. దౌల్తాబాద్‌ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ మండల సంస్థాగత ఎన్నికలు, అనుబంధ సంస్థలు, మండల సంస్థాగత ఎన్నికల కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే, వికారాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ కొడంగల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి సతీశ్‌ముదిరాజ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ప్రమోద్‌రావు, టీఆర్‌ఎస్‌ మాజీ జడ్పీటీసీ బాయిరెడ్డి మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ బాయిరెడ్డి నరోత్తంరెడ్డి, జడ్పీటీసీ కోట్లా మహిపాల్‌, ఎంపీపీ విజయ్‌కుమార్‌, వైస్‌ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, కొడంగల్‌ వ్యవసాయ మార్కెట్‌కమిటీ వైస్‌ చైర్మన్‌ భీములు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు భగవంతు, మాజీ జడ్పీటీసీ వెంకటమ్మపకీరప్ప, మండల కో ఆప్షన్‌ సభ్యుడు జాకీర్‌అలీ సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, మండల నాయకులు పాల్గొన్నారు. దౌల్తాబాద్‌ మండల కమిటీ అధ్యక్షుడిగా ప్రమోద్‌రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలు చేరిక

మండలంలోని నీటూర్‌, దౌల్తాబాద్‌, సలీంపూర్‌లతో పాటు పలు గ్రామాల కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్‌, టీఆర్‌ఎస్‌ కొడంగల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి సతీశ్‌ముదిరాజ్‌ సమక్షంలో పార్టీలో చేరారు. బొంరాస్‌పేట మండలంలోని హంసాన్‌పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి కొడంగల్‌లో ఎంపీ బండ ప్రకాశ్‌, ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement