
తాండూరు, ఆగస్టు 11: వికారాబాద్ జిల్లాలోనే తాండూరు నియోజకవర్గం చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఆలయాలకు కేం ద్రంగా భాసిల్లుతోంది. తెలంగాణ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా తాం డూరు నియోజక వర్గం పరిధిలో చారిత్రాత్మకమైన దేవాలయా లు ప్రసిద్ధి గాంచాయి . ముఖ్యంగా శైవ మత ఆలయాలకు తాండూరు ప్ర సిద్ధి గాంచినదని చారిత్రక ఆధారాలు చెబుతున్నా యి. బషీరాబాద్ మం డ లం నీళ్లపల్లి అటవీ ప్రాం తంలో దా దాపు 400 ఏళ్ల చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్న ఏ కాం బర రామలింగేశ్వర ఆల యం భక్తులను విశేషంగా ఆకర్షి స్తోంది. ఈ ఆలయం శ్రావణ, కార్తిక మాసంలో భక్తులతో కిక్కిరిసిపోతుం ది. ముఖ్యంగా శ్రా వణమాసం చివరిసోమవారం, మంగళవారాల్లో పెద్ద ఎత్తున జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. అలాగే వందల ఏళ్ల క్రి తం నిర్మించిన యాలాల మం డలం బాకారం ఆంజనేయ స్వామి దేవాలయం కూడా భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ దేవాలయంలో నవగ్రహా దేవతలు కూడా కొలువుదీరడం విశేషం. అలాగే యాలాల మం డలం జుంటుపల్లి అటవీ ప్రాంతంలో కొలువుదీరిన సీతారాముల వారి దేవాలయం కూడా ఎంతో చారిత్రక ప్రాధాన్యతను కలిగి ఉంది. తాండూరు పట్టణంలోని శ్రీ భావిగి భద్రేశ్వర దేవాలయం కూడా 500 ఏళ్ల చరిత్రను కలిగి ఉంది. పట్టణంలోని పోట్లి మహారాజ్ దేవాలయం, పాత తాండూరు వీరభద్రస్వామి దేవాలయం, చెరువెంటి ఈశ్వర ఆలయం, అంతప్పబావి శివాలయం, రసూల్పూర్ హనుమాన్ దేవాలయం, పెద్దేముల్ మండలం ఇందోల్ అటవీ ప్రాంతంలోని రామలింగేశ్వర దేవాలయాలు ఘన చరిత్రను చాటుతు భక్తులకు నిలయాలుగా మారాయి. తాండూరు మండ లం అంతారం తండాలో పదేళ్ల క్రితం భూకైలాస్ దేవాలయాన్ని జిల్లాలోనే ఎక్కడాలేని విధంగా నిర్మించారు. ఈ ఆలయ పరిసరాల్లోని భారీ 64 అడుగుల ఎత్తున్న శివుని విగ్రహం, 24 అడుగుల ఎత్తున్న ఆంజనేయ స్వామి విగ్ర హం, ఆలయ పరిసరాల్లో నిర్మితమైన గిరిజనుల ఆరాధ్యదైవమైన మారెమ్మ, సేవాలాల్ దేవాలయాలు కూడా భక్తుల ను విశేషంగా ఆకర్శిస్తున్నాయి. శ్రావణ మాసం, కార్తీక మా సంతో పాటు భక్తులు, ప ర్యాటకులు నిత్యం ఈ దేవాలయాలను సందర్శిస్తూ మొక్కులు చెల్లించుకోవడంతో పాటు ప్రకృతిని ఆశ్వాదిస్తారు. తాండూరు-కోకట్ రోడ్డు మార్గంలో ఉన్న షిర్డీసాయి బాబా దేవాల యం మరో షిర్డీ క్షేత్రంలా తలపిస్తోంది. ప్రతి గురువారం వేల సంఖ్యలో భక్తులు సాయి బాబాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి ఏటా గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తుంటారు.