కొడంగల్, అక్టోబర్9: సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్నదని కొడంగల్ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని హస్నాబాద్‌లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని పలువురు మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఆయన ముందుగా గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల పండుగలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకొనేందుకు చీరలను పంపిణీ చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు పకీరప్ప, సయ్యద్ అంజద్, పీఏసీఎస్ అధ్యక్షుడు కటకం శివకుమార్, మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్‌యాదవ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, గ్రామ అధ్యక్షుడు చంద్రప్రకాశ్, కో-ఆప్షన్ సభ్యులు ముక్తార్, సిద్ధిలింగప్ప, సురేశ్, ఎంట్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులను పూర్తి చేయాలి
కొడంగల్, అక్టోబర్9: మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని, 15 రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కొడంగల్ ఎమ్మెల్యే పట్న నరేందర్‌రెడ్డి ఆదేశించారు. శనివారం స్థాని అతిథి గృహంలో మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులు ప్రారంభమై చాలాకాలం కావస్తున్నా పూర్తి కావడం లేదని, అధికారుల పర్యవేక్షణాలోపం, నిర్లక్ష్యం కనిపిస్తున్నదని మండిపడ్డారు. అదేవిధంగా మున్సిపల్ పరిధిలో సీసీ, డ్రైన్స్ నిర్మాణాలకు సంబంధించి రూ.కోటి పనులకు, ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులకు సంబంధించి రూ.45 లక్షలకు ఇప్పటివరకు కూడా టెండర్ ప్రక్రియ చేపట్టలేదన్నా రు. సీసీ, డ్రైన్స్, ఎస్సీ సబ్‌ప్లాన్ పనులకు సంబంధించి త్వ రలో ఆన్లైన్ టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఉషారాణి, కౌన్సిలర్లు మధుసూదన్‌యాదవ్, ప్రభాకర్‌గౌడ్, రమేశ్, శంకర్‌నాయక్, సాయిప్రసన్న, వెంకట్‌రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు మునీర్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, డీఈ యూనుస్, ఏఈ ఖాజా పాల్గొన్నారు.
కొడంగల్ అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ
కొడంగల్, అక్టోబర్9: కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల సర్పంచ్‌లు పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహం లో ఎమ్మెల్యేను సర్పంచ్‌లు, గిరిజన నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకుంఠధామాలకు అప్రోచ్ రోడ్లు, నియోజకవర్గంలోని తండాల అభివృద్ధిపై అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినందుకు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపా రు. అనంతరం నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ మండల, గ్రామ అధ్యక్షులను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, గిరిజనులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే
దౌల్తాబాద్, అక్టోబర్9: మండలంలోని నంద్యానాయక్‌తండా గ్రామ పంచాయతీలోని భాగ్యతండాలో శనివారం జరిగిన తుల్జాభవానీదేవి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం లో కొడంగల్ ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూ జలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతన ఆలయ నిర్మాణాన్ని కృషి చేస్తున్న హరిరాథోడ్ను అభినందించారు. తం డాలో తాగునీటి, విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కోట్ల మహిపాల్, ఎంపీపీ విజయ్‌కుమార్, మహిపాల్‌రెడ్డి, ప్రమోద్‌రావు, మోహన్‌రెడ్డి, సర్పంచ్ పాల్గొన్నారు.