
దోమ, ఆగస్టు 9 : అర్హులైన నిరుపేదలందరికి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తామని పరిగి ఎమ్మెల్యే కే.మహేశ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రానికి మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి జడ్పీటీసీ నాగిరెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంజూరైన 50 ఇండ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని రోడ్లు భవనాల శాఖ అధికారులకు సూచించారు. మండలానికి మరో 100 ఇండ్లకు స్థలం నిర్ధారణ అయిన తరువాత మంజూరు చేయిస్తానని తెలిపారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.ఇండ్ల నిర్మాణానికి చుట్టుపక్కల ఉన్న పొలంవారు అడ్డంకులు సృష్టిస్తున్నారని రోడ్లు భవనాల శాఖ అధికారులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయగా.. వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ వహీదాఖాతుమ్ను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనసూయ, వైస్ ఎంపీపీ మల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీటీసీ అనిత, కోఆప్షన్ సభ్యులు ఖాజాపాషా, లక్ష్మయ్య, వార్డు సభ్యులున్నారు.