రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్‌పటేల్
వికారాబాద్, అక్టోబర్ 4: ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్‌పటేల్ సూచించారు. సోమవారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా వికారాబాద్ పట్టణం ఆలంపల్లి దసరా ఉత్సవాలు జరిగే బోనమ్మ గుడి ప్రాంగణంలో కేసీఆర్ సేవాదళం ప్రెసిడెంట్ బోరెడ్డి రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ మంజులతో కలిసి జమ్మి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గుడిలో, ఊరిలో జమ్మి మొక్కలు నాటే కార్యక్రమం చాలా అభినందనీయమన్నారు. అంతకు ముందు ఆలయంలో పూజలు చేశారు. పట్టణ వాసులకు జమ్మి మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ శేఖర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్, కౌన్సిలర్లు కిరణ్పటేల్, అనంత్‌రెడ్డి, రామస్వామి, సురేశ్‌గౌడ్, నాయకులు శంకర్, దత్తు, దోమ నర్సింహారెడ్డి, జగన్, ప్రభాకర్‌రెడ్డి, సురేశ్, ప్రశాంత్, కిశోర్, శేఖర్, నర్సింహులు పాల్గొన్నారు.