పరిగి, అక్టోబర్ 3: దసరా వేడుకల్లో భాగంగా బతుకమ్మ సంబరాలను పుర స్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కానుకగా చీర, సారెను అందించి ఆదరిస్తున్నదని ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని రంగాపూర్ గ్రామంలో మహిళలు బతు కమ్మ చీరలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలం గాణ ఆడపడచుల కు అన్నగా బతుకమ్మ కానుకగా చీరను అందించి మహిళా గౌరవాన్ని పెంచినట్లు తెలిపారు. తెలంగాణ ఆనవాయితీ ప్రకారం అక్కా, చెల్లెళ్లను సారె అందించే సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నదని పేర్కొన్నారు. చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాన్ని కల్పిస్తూ.. చేనేత చీరను ఆడపడచులకు అందించడం పట్ల మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, జెడ్పీటలీసీ హరిప్రియ, మార్కెట్ కమిటీ చైర్మన్,పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుంధర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్, సీనియర్ నాయకులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్‌లో..
వికారాబాద్, అక్టోబర్ 3: వికారాబాద్ పట్టణంలోని 31వ వార్డు శివరాంనగర్ కాలనీలో బతుకమ్మ చీరలను కౌన్సిలర్ గాయత్రీలక్ష్మణ్ పంపిణీ చేశారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూ, బతుకమ్మ పండుగను జరుపుకునేందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు లక్ష్మణ్, సందీప్ న్నారు.
కొడంగల్‌లో..
కొడంగల్/బొంరాస్‌పేట, అక్టోబర్ 3: కొడంగల్ మండలంలోని పర్సాపూర్,ఆలేడ్ గ్రామాల్లో సర్పంచ్‌లు సయ్యద్ అంజద్, విజయమ్మ బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పర్సాపూర్ ఎంపీటీసీ గోవిందమ్మ, ఆలేడ్ సెక్రెటరీ రమేశ్‌రాథోడ్, సముద్రమ్మ పాల్గొన్నారు. బొంరాస్‌పేట మండలంలోని బొంరాస్‌పేట, మెట్లకుంట, బురాన్‌పూర్, మదన్‌పల్లి, సా లిండాపూర్ గ్రామాల్లో మహిళలకు ఎంపీపీ హేమీబాయి, జడ్పీటీసీ అరుణాదేశు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు నారాయణ, లక్ష్మీ, రుక్కీబాయి, ఎంపీటీసీలు సుదర్శన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యాదగిరి, ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, నాయకులు చాంద్‌పాషా, రాములు, మహేందర్, వాహబ్, సలాం, రాజునాయక్ పాల్గొన్నారు.
పెద్దేముల్లో..
పెద్దేముల్, అక్టోబర్ 3 : మంబాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో స్థానిక ఎంపీటీసీ శ్రీనివాస్, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు నారాయణ రెడ్డిలతో కలిసి సర్పంచ్ శ్రావణ్ కుమార్ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్య క్రమంలో వార్డు సభ్యులు బాల ప్ప, మోహిద్,కిరణ్, నాయకులు బాలప్ప, ధన్‌రాజ్, ఇబ్ర హీం, ఖలీల్, వెంకటయ్య పాల్గొన్నారు.
కులకచర్లలో..
కులకచర్ల, అక్టోబర్ 3 : కులకచర్ల మండల పరిధిలోని రాంరెడ్డిపల్లి గ్రామం లో సర్పంచ్ సత్యయ్య, ఎంపీటీసీ పులింగ విజయలక్ష్మి, ఉపసర్పంచ్ దామోదర్‌రెడ్డి మహిళ లకు బతుకమ్మ చీరలను అందజేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.