మోమిన్‌పేట, అక్టోబర్ 1:మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ నిఖిల ఆకస్మింగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి గ్రామ పంచాయతీకి సంబంధించిన 32 రకాల రిజిస్టర్లను, నర్సరీ, వైకుంఠధామం నిర్మాణ పనులు, దళితవాడలో మురికి కాలువలు, రోడ్లు, విద్యుత్ సదుపాయలను పరిశీలించా రు. గ్రామ పంచాయతీ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకపోవడం, ఉపాధిహామి కూలీ లకు వంద రోజుల పని కల్పించకపోవడం, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండక పోవ డంపై, నర్సరీ నిర్వహణ సరిగా లేవపోవండంతో పంచాయతీ కార్యదర్శి కృష్ణ చైతన్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ కి సం బంధించిన అన్ని రికార్డలను సకాలంలో పూర్తి చేయాలని, ఉపాధిహామి కూలీలకు వంద రోజుల పని దినాలు కల్పించాలని, ప్రతి రోజు ఉదయం 6 గంటలకు కూలీలను ట్రాక్టర్ లో ఎక్కించుకుని పని ప్రాంతంలో వదలాలని ఆదేశించారు. ప్రతి రోజు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలని నర్సరీలో మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేప ట్టాలని, 15 రోజుల తర్వాత తిరిగి వస్తానని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పంచా యతీ కార్యదర్శిని హెచ్చరించారు. వైకుంఠధామం పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రామంలో సరిగా బస్సు సౌకర్యం లేదని, 35 మంది విద్యార్థులకు ప్రాథమిక పాఠశాలలో బోధించడానికి ఉపాధ్యాయులు లేరని, వర్షాల వల్ల రోడ్లన్ని దెబ్బతిన్నాయని గ్రామస్తులు తెలుపగా కలెక్టర్ స్పందించి పాఠశాలకు ఒక ఉపాధ్యాయుడిని నియమిస్తానని,రోడ్లు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ అనం తమ్మ, డీఆర్డీవో కృష్ణన్,.ఎంపీడీవో శైలజా రెడ్డి,ఎంపీవో యాదగిరి, ఏపీవో శంకర్, ఆర్ఐ ఆరుణ్, టీఏ ఎల్లయ్య, పంచాయతీ కార్యదర్శి కృష్ణ చైతన్య పాల్గొన్నారు.