
వికారాబాద్, సెప్టెంబర్ 1 : భూ సమస్యలతో సతమతం అవుతున్న వారికి డయల్ ఇన్ గ్రీవెన్స్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ తెలి పారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన డయల్ ఇన్ గ్రీవెన్స్ కార్యక్రమానికి భూ సమ స్యలపై 22 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ మా ట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ కార్యక్రమం ద్వారా వెంటనే పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రతి బుధవారం వికారాబాద్ కలెక్టరేట్లో ధరణి భూ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉదయం 9:10 గంటల నుంచి 10:30 గంటల వరకు ఫోన్ చేసి సమస్యలు విన్నవించాలన్నారు. ఈ కార్య క్రమంలో కలెక్టర్ కార్యాలయ తహసీల్దార్లు శ్రీధర్, సుధా, నిరంజన్‌రావు, ఈడీఎం మహ మూద్‌అలీ, ధరణి కో ఆర్డినేటర్ నర్సింహా పాల్గొన్నారు.