
కడ్తాల్, సెప్టెంబర్ 1 : టీఆర్ఎస్ జెండా పండుగను మండల వ్యాప్తంగా జయప్రదం చేయాలని పార్టీ మండలాధ్యక్షుడు బాచిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌తో కలిసి ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణమే ధ్యేయంగా జెండా పండుగను నిర్వహిస్తున్నామన్నారు. మండల కేంద్రంలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న జెండా పండుగలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పాల్గొంటారన్నారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ్‌లు హరిచంద్‌నాయక్, తులసీరాంనాయక్, యాదయ్య, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు పరమేశ్, టీఆర్ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షుడు అంజయ్య, నాయకులు శ్రీను, లాయక్‌అలీ, గోపాల్, చంద్రమౌళి, రమేశ్, ప్రకాశ్‌నాయక్, లక్ష్మయ్య, మహేశ్, పాండునాయక్, భీక్యానాయక్, భీమానాయక్ పాల్గొన్నారు.
షాబాద్, సెప్టెంబర్ 1 : రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయమని జడ్పీటీసీ అవినాశ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. జెండా పండుగలో పార్టీ నిర్మాణంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ నెల 10వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో జెండా పండుగ నిర్వహిస్తూ గ్రామ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు నర్సింగ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ శేఖర్‌రెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు చాంద్‌పాష, నాయకులు రాజేందర్‌రెడ్డి, దర్శన్, నర్సింహారెడ్డి, రమేశ్‌యాదవ్, మధుకర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, మల్లారెడ్డి తదితరులున్నారు.
మొయినాబాద్, సెప్టెంబర్ 1 : చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో నేటి నుంచి జెండా పండుగ కార్యక్రమం ఉంటుందని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
చేవెళ్ల టౌన్, సెస్టెంబర్ 1 : నేడు నిర్వహించే టీఆర్ఎస్ జెండా పండుగను గ్రామాల్లో ఘనంగా నిర్వహించుకోవాలని ఎంపీపీ విజయలక్ష్మి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్ తెలిపారు.
మంచాల, సెప్టెంబర్ 1 : టీఆర్ఎస్ జెండా పండుగలో ప్రతి కార్యకర్త పాల్గొనాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్ అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించడమే కాకుండా ప్రతి కార్యకర్త ఇంటిపై కూడా పార్టీ జెండా ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బహదూర్ పాల్గొన్నారు.
కొత్తూరు, సెప్టెంబర్ 1 : టీఆర్ఎస్ జెండా పండుగకు మండలం మస్తాబైంది. మున్సిపాలిటీలోని 12 వార్డులు, పంచాయతీల్లో కొత్త దిమ్మెలను ఏర్పాటు చేశారు. పార్టీ పటిష్టతే లక్ష్యంగా టీఆర్ఎస్ అధినాయకత్వం జెండా పండుగకు పిలుపునివ్వడంతో గ్రామాల్లో జెండా ఎగురవేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
కొత్తూరు రూరల్, సెప్టెంబర్ 1 : మండల పరిధిలోని మక్తగూడ, మల్లాపూర్, గూడూరు, మల్లాపూర్‌తండా గ్రామాల్లో స్థానిక నాయకులతో చర్చించి, పార్టీ జెండా దిమ్మెల నిర్మాణం, మరమ్మతుల పనులను ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి పరిశీలించారు. మండల పరిధిలోని ఏనుగులమడుగు తండాలో సర్పంచ్ అరుణరమేశ్ ఆధ్వర్యంలో పార్టీ దిమ్మెను కొత్తగా ఏర్పాటుచేసి, రంగులద్దారు. కార్యక్రమంలో మల్లాపూర్‌తండా, గూడూరు, మక్తగూడ సర్పంచ్‌లు రవినాయక్, సత్తయ్య, కాట్నరాజు, వార్డుసభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నందిగామ, సెప్టెంబర్ 1 : ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ జెండాను అవిష్కరించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నందిగామ మండల కేంద్రంలో సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న టీఆర్ఎస్ జెండా ఏర్పాట్లను జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్ పరిశీలించారు. కార్యక్రమంలో చేగూరు పీఏసీఎస్ చైర్మన్ అశోక్, మాజీ చైర్మన్ విఠల్, టీఆర్ఎస్ నాయకులు కిష్ణయ్య, పెంటయ్య, నర్సింహ, రమేశ్, గోపాల్ పాల్గొన్నారు.