
వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందిన వారి కుటుంబాలను మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు యాదయ్య, ఆనంద్‌లు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఆదుకుంటామని భరోసా
ఇచ్చారు.
వికారాబాద్, ఆగస్టు 31 : వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతిచెందిన చాకలి శ్రీను కుటుంబాన్ని ఆదుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం నవాబుపేట మండలం పులిమామిడి గ్రామానికి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణానికి కృషిచేస్తామన్నారు. పిల్లలు బాగా చదువుకోవాలని సూచించారు. ప్రభుత్వం తరపున అందించే పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు. కుటుంబానికి రూ.10వేలు అందజేశారు. ప్రమాదకరంగా ఉన్న వాగుల వద్దకు ప్రజలెవరూ వెళ్లకూడదని వారు సూచించారు. వీరి వెంట చేవెళ్ల ఎంపీపీ భవాని, సర్పంచ్ విమల, ఎంపీటీసీ తేజస్విని, ఉప సర్పంచ్ సుధాకర్ ఉన్నారు.
మోమిన్‌పేట మండలంలో..
మోమిన్‌పేట, ఆగస్టు 31: ఆదివారం కురిసిన భారీ వర్షాలకు శంకర్పల్లి మండలం కొత్తపల్లి వాగులో మృతిచెందిన వెంకటయ్య, మర్పల్లి మండల తిమ్మాపూర్ వాగులో మృతిచెందిన ప్రవళిక కుటుంబ సభ్యులను మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్ పరామర్శించారు. ఓదార్చి వారికి భరోసా కల్పించారు. బాధిత కుటుంబ సభ్యులకు రూ.10వేలు అందజేశారు. అదే విధంగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యువకుడు బొడ్డు లక్ష్మీకాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి బాధిత వెంకటయ్య, ప్రవళిక కుటుంబసభ్యులను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి ఉన్నారు.
మర్పల్లి మండలంలో..
మర్పల్లి, ఆగస్టు 31 : మండలంలోని రావులపల్లి గ్రామానికి చెందిన నవాజ్‌రెడ్డి భార్య ప్రవళిక, అక్క శ్వేత తిమ్మాపూర్ వాగులో కొట్టుకుపోయి మృతిచెందగా అల్లుడు ఇషాంత్‌రెడ్డి ఆచూకీ దొరకలేదు. విషయం తెలుసుకున్న మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్‌తో కలిసి రావులపల్లి గ్రామంలోని బాధిత కుటుంబాన్ని సందర్శించి పరామర్శించారు. రూ.25వేలు అందజేశారు. ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని తెలిపారు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వికారాబాద్ జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్‌తో కలిసి నవాజ్రెడ్డిని పరామర్శించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మధుకర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఫసియుద్దీన్, కో ఆప్షన్ సభ్యుడు సోహెల్, సర్పంచ్ దేవమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేశం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ప్రభాకర్‌గుప్తా, నాయకులు రమేశ్, మధుకర్, రామేశ్వర్, మాజీ వైస్ ఎంపీపీ అంజయ్యగౌడ్, సురేశ్‌కుమార్ పాల్గొన్నారు.