రోడ్లపై పతంగులను ఎగురవేసే మాంజా పడడం వల్ల వాహనదారులకు ప్రమాదం ఉంటుంది. రోడ్లపై పతంగుల దారం కనిపిస్తే పక్కకు తప్పించాలి.సంక్రాంతి పండుగకు భవనాలపై పతంగులు ఎగురవేసేవారు నిర్లక్ష్యంగా ఉండకూడదు. గాల్లో పతంగులు ఎగురవేస్తూ వెనక్కి వెళితే కిందపడి ప్రమాదం జరిగే అవకాశం ఉంది.పతంగిని పైకి లేపడం కోసం కీంచ్కట్ (దారాన్ని వెనక్కి లాగడం) చేస్తుంటారు. అయితే తమ వెనుక ఎంత స్థలం ఉందో చూసుకుని అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. పిల్లలు భవనాలపైకి ఎక్కి అక్కడ ఉండే ప్రహరీపైకి ఎక్కడం, వాటర్ ట్యాంకుల వద్దకు వెళ్లడం.. మెట్లపైకి ఎక్కి చూడడం లాంటివి చేస్తుంటారు. కాబట్టి వారి గురించి అక్కడ ఉండే పెద్దవారు
జాగ్రత్తగా ఉండాలి.
ఇందూరు, జనవరి 12: ఉమ్మడి జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. ప్రత్యేకంగా తయారు చేసిన పతంగులు మార్కెట్లో కనువిందుచేస్తున్నాయి. చిన్నారులు పతంగుల కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. ప్రతి ఏడాది మాదిరిగా పతంగుల జోరు కొనసాగుతున్నది. గరుడ పక్షి, కప్ప, విమానం, చేప, పులి, ఫ్రీ ఫైర్, చోటా భీం, డోరా బుజ్జీ, అవేంజర్స్, చెష్మా చిత్రాలతో ఉన్న అనేక రకాల పతంగులను అమ్మకానికి పెట్టారు. దీంతో చిన్నారులు ఆసక్తిగా తిలకిస్తూ కొనుగోలు చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని పెద్దబజార్, వినాయక్‌నగర్, రాజరాజేంద్ర చౌరస్తా, బస్టాండ్ ప్రాంతాల్లో పతంగుల విక్రయ కేంద్రాలు వెలిశాయి. గతేడాది కరోనా ఉధృతితో పతంగుల కొనుగోళ్లు అంతగా జరగలేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో పతంగుల కొనుగోళ్లు జోరందుకున్నాయి. రూ.5నుంచి రూ.500 విలువజేసే పతంగులను అందుబాటులో ఉంచారు. 300 నుంచి 400 మీటర్ల కాటన్ దారం రూ.20కి, నైలాన్ దారం రూ.50కి విక్రయిస్తున్నారు. కట్టెతో తయారు చేసిన చెరకలు రూ.80 నుంచి రూ.200 వరకు ఉండగా, ప్లాస్టిక్ చెర క రూ.40 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. ఇదిలా ఉం డగా మార్కెట్లో అక్కడక్కడా నిషేధిత చైనా మాంజా అందుబాటులో ఉన్నట్లు సమాచారం.
వీటితోనే ప్రమాదం..
నైలాన్, చైనీస్, గ్లాస్ కోటెడ్ ఉన్న కాటన్ మాంజాలపై నిషేధం కొనసాగుతున్నది. ఎందుకంటే పక్షులు, జంతువులకే కాదు మనుషులకూ ప్రమాదం తప్పదని పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు. పతంగులు ఎగురవేసేందుకు మాంజాను కాకుండా సాధారణ దారాన్నే వినియోగించాలని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు.
గిరాకీ బాగుంది..
మూడేండ్లుగా పతంగుల వ్యాపా రం చేస్తు న్నా. పోయిన ఏడాది కరోనా మూలంగా గిరాకీ అం తగా లేదు. ఇప్పుడు కరోనా తగ్గడంతో పతంగుల కొనుగోళ్లు పెరిగాయి. రూ. 60వేలతో పతంగుల స్టాల్ పెట్టాను. హైదరాబాద్ నుంచి పతంగులు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నాను. మా దగ్గర రూ.5 నుంచి రూ.200 వరకు ధరల్లో పతంగులు ఉన్నాయి.