కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వే రెండో రోజూ కొనసాగింది. వైద్యారోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి కొవిడ్ లక్షణాలున్న వారిని గుర్తించారు. జిల్లాలో శనివారం 34,225 ఇండ్లకు వెళ్లగా 1,726 మందికి జ్వరం, జలుబు తదితర లక్షణాలున్న వారికి హెల్త్ కిట్లు అందించారు. జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే ప్రభుత్వ దవాఖానకు రావాలని సూచించారు.
యాదాద్రి, జనవరి 22 : కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వే కొనసాగుతున్నది. శనివారం రెండో రోజు పకడ్బందీగా ఇంటింటి సర్వే చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలో వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి అనుమానితులను గుర్తించి హోం ఐసొలేషన్ కిట్లు అందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్ మాట్లాడుతూ అర్హులైన వారంతా కొవిడ్ టీకా వేయించుకోవాలని, మాస్క్ లేకుండా బయటకు వెళ్లొద్దని సూచించారు. కార్యక్రమంలో ఆశ కార్యకర్త ముక్తర్ల వెంకటమ్మ, అంగన్వాడీ టీచర్, సిబ్బంది పాల్గొన్నారు.
ఆలేరురూరల్ : ఫీవర్సర్వేకు ప్రజలు సహకరించాలని ఎంపీడీఓ జ్ఞానప్రకాశ్‌రావు సూచించారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో జ్వర సర్వేను ఆయన పరిశీలించారు. జ్వరంతో బాధపడుతున్న వారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, పంచాయతీకార్యదర్శులు, అంగన్వాడీలు, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట రూరల్ : ఇంటింటి జ్వర సర్వే ఎంపీడీఓ కారం ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. సిబ్బంది లక్షణాలున్న వారికి హోం ఐసొలేషన్ కిట్ అందించారు.
తుర్కపల్లి : మండల వైద్యాధికారి చంద్రారెడ్డి సిబ్బందితో కలిసి ఇంటికి వెళ్లి జ్వర పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మెడికల్ కిట్లను అందించారు.
మోత్కూరు : వైద్యారోగ్య. పంచాయతీ రాజ్, ఐసీడీఎస్ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి కరోనా లక్షణాలున్న వారిని గుర్తించారు. హోం ఐసొలేషన్ మెడిసిన్ కిట్‌ను అందించారు. మండలంలోని దాచారం, పొడిచెడు, పాటిమట్ల, సదర్శాపురం, దత్తప్పగూడెం, పాలడుగు, పనకబండ, ముశిపట్ల గ్రామాల్లో మండల ప్రత్యేకాధికారి యాదయ్య, ఎంపీడీఓ మనోహర్‌రెడి పర్యవేక్షించారు. మోత్కూరులో మున్సిపల్ కమిషనర్ షేక్ మహమూద్ పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీఓ సురేందర్‌రెడ్డి, కార్యదర్శులు పాల్గొన్నారు.
మోటకొండూర్ : మండలంలోని పలు గ్రామాల్లో వైద్య సిబ్బంది, ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి జ్వర లక్షణాలున్న వారిని గుర్తించి కిట్లు అందించారు. మండల వ్యాప్తంగా 1897 ఇండ్లను సర్వే చేయగా 41 మందికి లక్షణాలు ఉండగా మందులు అందించినట్లు పీహెచ్సీ వైద్యుడు ప్రవీన్‌కుమార్ తెలిపారు.
రాజాపేట : మండలంలోని కొత్తజాలలో వైద్య సిబ్బంది ఫీవర్ సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఠాకూర్ ధర్మేందర్‌సింగ్ పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం) : మండల కేంద్రంతో పాటు గ్రామాలలో జ్వర సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ కోల సత్తయ్యగౌడ్, అంగన్వాడీ టీచర్లు ధనమ్మ, శ్రీవాణి, అత్తరున్నిసాబేగం, వైద్య సిబ్బంది షాహిన్, హేమలత పాల్గొన్నారు.
రామన్నపేట : మండలంలోని పలు గ్రామాల్లో మునిపంపుల పీహెచ్సీ సిబ్బంది ఇంటింటి సర్వే చేశారు. కార్యక్రమంలో సర్పంచులు గుత్తా నర్సింహారెడ్డి, ముత్యాల సుజాత, బొక్క యాదిరెడ్డి, ఏఎన్ఎంలు కవిత, ఆదిలక్ష్మి, కార్యదర్శి లావణ్య, ఉపేందర్, నాగమణి పాల్గొన్నారు.
వలిగొండ : మండల వ్యాప్తంగా 1,847 ఇండ్లను సర్వే చేసిన ఆరోగ్య సిబ్బంది జ్వర లక్షణాలున్న 207 మందిని గుర్తించి మెడికల్ కిట్లు అందించినట్లు వైద్యాధికారి డాక్టర్ సుమన్‌కల్యాణ్ తెలిపారు.
1,726 మందికి మెడికల్ కిట్లు
భువనగిరి అర్బన్, జనవరి 22 : జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జ్వర సర్వే శనివారం రెండో రోజు కొనసాగింది. జిల్లాలో 757 వైద్య బృందాలు 34,225 ఇండ్లల్లో సర్వే నిర్వహించాయి. జ్వరం, జలుబు, దగ్గుతో పాటు కరోనా లక్షణాలున్న 1,726 మందిని గుర్తించి మెడికల్ కిట్లను అందజేశాయి. రెండు రోజుల్లో మొత్తం 57,761 ఇండ్లలో జ్వర సర్వే చేయగా 27.46శాతం నమోదైంది. ఇప్పటి వరకు 3,091 మందికి మెడికల్ కిట్లను అందజేశారు. ఇప్పటికే జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కరోనా టీకా మొదటి డోసులో 108శాతం పూర్తిచేయగా, రెండవ డోసు 82శాతం, టీనేజర్లకు 31439 మందికి ఇవ్వగా 87శాతం నమోదైంది. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌తో పాటు 60 సంవత్సరాలు నిండిని వృద్ధులకు బూస్టర్ డోస్ 28 శాతం అందించారు.