ఎల్బీనగర్ : ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్చాలెంజ్తో దేశ, విదేశాల్లో హరితవిప్లవం వచ్చిందని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. మంగళవారం ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని కొత్తపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి ఉచితంగా నోటు పుస్తకాలను పంపిణీ చేశారు.
అనంతరం స్థానిక హనుమాన్ దేవాలయంలో పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దయానంద్ గుప్తా మాట్లాడుతూ గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా ఎంపీ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారని అన్నారు.
సంతోష్‌కుమార్ స్పూర్తితో నేడు తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా దేశంలో, విదేశాల్లోనూ గ్రీన్‌చాలెంజ్‌లో భాగంగా పలువు రు సెలబ్రిటీలు మొక్కలు నాటుతున్నారన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొగ్గారపు శరత్చంద్ర, అశోక్ జైన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.