గోల్నాక : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావుపూలే ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ సర్కార్ బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఆదివారం అంబర్పేట పూలే విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన పూలే 131వ వర్ధంతి కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో కలసి ఆయన కలసి ఆయన హాజరై.. పూలే విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యానికి గురైన బీసీల సంక్షేమం కోసం తెలంగాణ సర్కార్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందని అన్నారు. సంఘ సంస్కర్తగా భారత సమాజంలోని కుల వివక్షపై ఉద్యమించిన పోరాటయోదుడు పూలే అని కొనియాడారు.
పూలే వర్థంతి కార్యక్రమంలో మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావుతో పాటు పలు పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరై.. పూలే విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు.