Jeevandan | ఐదుగురికి ఆయువు పోసిన అన్నదాత

ఖైరతాబాద్ : దేశానికి అన్నం పెట్టే అన్నదాత తాను మరణిస్తూ ఐదుగురికి ఆయువు పోశాడు. నల్గొండ జిల్లా జాజిరెడ్డి గూడెంకు చెందిన రైతు కొరాపిదత్త సత్తయ్య (55) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ నెల 20న సత్తయ్య ఒక్కసారిగా ఆపస్మారక స్థితిలోకి వెళ్లి కిందపడిపోయాడు.
కుటుంబ సభ్యులు మలక్‌పేటలోని యశోద దవాఖానకు తరలించగా, చికిత్స అందించారు. సుమారు 72 గంటల పాటు చికిత్స అందించినా ఫలితం లేదు. వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఐసీ బ్లీడ్గా గుర్తించారు. ఈ నెల 23న బ్రెయిన్‌డెడ్‌కు గురైనట్లు న్యూరో ఫిజీషియన్లు నిర్ధారించారు.
విషయం తెలుసుకున్న జీవన్‌దాన్ ప్రతినిధులు ఆస్పత్రిలోని కుటుంబసభ్యులను కలిసి అవయవదానం చేయడం ద్వారా పలువురిలో సత్తయ్య జీవించే ఉంటాడని వారికి దాని విశిష్టతను వివరించారు. అందుకు వారు అంగీకరించారు. సత్తయ్య శరీరం నుంచి కాలేయం, రెండు మూత్రపిండాలు, ఊపిరితిత్తులను సేకరించారు.
అవసరమైన రోగులకు ఆ అవయవాలను అందిస్తామని వైద్యులు తెలిపారు. అవయవదానం కోసం ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులను జీవన్‌దాన్ ప్రతినిధులు అభినందించారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

