సికింద్రాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, సంక్షేమం, అభివృద్ధిలో సికింద్రాబాద్‌ను అగ్రస్థానంలో తీర్చిదిద్దుతున్నామని తెలంగాణ శాసనసభ ఉపసభాపతి తీగుల్ల పద్మారావుగౌడ్ అన్నారు.
సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్మండి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం దాదాపు రూ 82లక్షల మేరకు వివిధ అభివృద్ధి పనులను పద్మారావు స్థానిక కార్పొరేటర్ హేమతో కలసి ప్రారంభించారు.ఈసందర్భంగా మాట్లా డుతూ సికింద్రాబాద్ పరిధిలోని ఐదు పార్కులను ఎంపిక చేసి మోడల్ పార్కులుగా తీర్చి దిద్దుతున్నామని తెలిపారు.
అన్ని స్మశాన వాటికలలో వివిధ సదుపాయాలను కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. మహ్మద్గూడలో రెడ్ క్రాస్ పార్కులో అభివృద్ధి పనులు, బీదల బస్తీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, సీతాఫల్మండి స్శశాన వాటికలో అభివృద్ధి పనులను పద్మారావుగౌడ్ ఈసందర్భంగా ప్రారంభించారు.
అనంతరం డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల మీదుగా పాదయాత్ర నిర్వహించి పజ్రల సమస్యలు అడిగి తెలుసు కున్నారు. ఈకార్యక్రమంలో అధికారులు జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ పల్లె. మోహనరెడ్డి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్‌గౌడ్, ఈఈ ఆశాలత, రఘుకుమారి, మధురిమ లతో పాటు నాయకులు కిషోర్‌కుమార్,రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.