కాచిగూడ : తెలంగాణ ప్రభుత్వం పేద, మద్యతరగతి ప్రజల కోసం నాణ్యమైన వైద్య సేవలను అందిస్తుందని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గోల్నాక డివిజన్లోని కామ్‌గార్‌నగర్‌లో శుక్రవారం బస్తీ దవాఖానను డిప్యూటీ స్పీకర్ పద్మారావు, గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలో 7 బస్తీ దవాఖానలు అందుబాటులోకి తెచ్చినట్టు..త్వరలో మరో 2 బస్తీ దవాఖానల ఏర్పాటుకు సన్నహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య శాఖలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చిందన్నారు.
ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ దవాఖానాల్లో రోగులకు మైరుగైన సేవలు అందించడానికి కేసీఆర్ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని ఆయన పేర్కొన్నారు. పేద ప్రజల కోసం ప్రభుత్వం నాణ్యమైన వైద్య సేవలను అందిస్తుందని, ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు మైరుగైన సేవలను అందిస్తుందని పేర్కొన్నారు.
రాజకీయాలకు ఆతీతంగా దేశంలో ఎక్కడలేని విధంగా ప్రభుత్వం పేదల ఆరోగ్యలను దృష్టిలో ఉంచుకుని బస్తీ దవాఖానల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్నకంగా చేపట్టిన బస్తీ దవాఖానను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎప్పీహెచ్ఓ పద్మజ, జోనల్ కమీషనర్ శ్రీనివాస రెడ్డి, పీఓ రజితారెడ్డి, హిమయత్‌నగర్ ఎమ్మార్వో లలిత, డీసీ వేణుగోపాల్, ఏఎంహెచ్ఓ జ్యోతి, జలమండలి అధికారులు మహేందర్‌రెడ్డి, భవన, వెంకటేశ్‌యాదవ్, తదితరులు పాల్గొన్నారు.