తెలుగుయూనివర్సిటీ : తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలలో విశేషమైన సేవలు అందించిన 44మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018 సంవత్సరానికి కీర్తి పురస్కారాలను గురువారం ప్రకటించింది. ఉభయ తెలుగు రాష్ట్రా లకు చెందిన ప్రముఖులను పురస్కారాలకు తెలుగువర్సిటీ వీసీ ఆచార్య టి.కిషన్‌రావు అధ్యక్షతన జరిగిన నిపుణుల సంఘం ఎంపిక చేసింది.
డాక్టర్ గంప నాగేశ్వరరావు (వ్యక్తిత్వ వికాసం), స.వెం.రమేష్ (భాషాచ్చందసాహిత్య విమర్శ), డాక్టర్ మచ్చ హరిదాస్ (సాహిత్య విమర్శ), మెట్టు మురళీధర్ (కథ), తాటికొండాల నరసింహారావు (నాటక రంగం), డాక్టర్ బి.జానకి (జనరంజక విజ్ఞానం), యం.వి రామిరెడ్డి(కాల్పనిక సాహిత్యం), యం. పవన్‌కుమార్(ఉత్తమ ఉపాధ్యాయుడు), రాజశుఖ (పత్రికారచన),
మరిపాల శ్రీనివాస్( జీవిత చరిత్ర), జావేద్ (కార్టూనిస్ట్), డాక్టర్ ఆర్.కమల (ఉత్తమ రచయిత్రి), డాక్టర్ పూస లక్ష్మీనారాయణ(వచన కవిత), కోడూరు పుల్లారెడ్డి(సృజనాత్మక సాహిత్యం), డాక్టర్ యం. శ్రీకాంత్ కుమార్(పరిశోధన), డాక్టర్ గురవారెడ్డి(హాస్యరచన), సి.జానకీబాయి(ఉత్తమ నటి), వల్లూరు శ్రీహరి(ఉత్తమ నటడు), రావు పుల్లాచారి (ఉత్తమ నాటక రచయిత), షేక్‌బాబు(హేతువాద ప్రచారం), డాక్టర్ విజలక్ష్మి పండిట్(ఉత్తమ రచయిత్రి),
డాక్టర్ టి.వి భాస్కరాచార్య(వివిధ ప్రక్రియలు), పుల్లూరి ప్రభాకర్(అవధానం), డాక్టర్ సూరేపల్లి సుజాత (మహిళాభ్యుదయం) , అడ్లూరి రవీంద్రాచారి(గ్రంథాలయకర్త), ఆచార్య దొర్తి బజాక్(గ్రంథాలయ సమాచార విజ్ఞానం), జి. కిరణ్మయి (ఆంధ్రనాట్యం ), గులాబీల మల్లారెడ్డి (నవల), గడ్డం శ్రీనివాస్ (జనపద కళలు), ఆచార్య మాడభూషి శ్రీధర్ (ఆధ్యాత్మిక సాహిత్యం), తిరువాయిపాటి చక్రపాణి(పద్యం), సంజయ్‌కిషోర్(సాంస్కృతిక సంస్థ నిర్వహణ),
నొల్లాల వాణి(జానపద గాయకులు), డాక్టర్ వాసరవేణి పరుశురాములు(బాలసాహిత్యం), మ్యాజిక్ బోస్(ఇంద్రజాలం), డాక్టర్ మోత్కూరి మాణిక్యరావు(పద్య రచన), దివాకర్ల సురేఖామూర్తి(లలిత సంగీతం), ఇందిరా కామేశ్వరరావు (శాస్త్రీయ సంగీతం), డాక్టర్ సాగి కమలాకరశర్మ(జ్యోతిషం), ఆచార్య వెనకపల్లి తిరుపతయ్య(గేయం),
బి.సుధీర్‌రావు (కూచిపూడి నృత్యం), డాక్టర్ బి.జయరాములు(ప్రాచీన సాహిత్యం), కృష్ణా నాయక్ హాన్(, అనువాద సాహిత్యం), డాక్టర్ పి.లక్ష్మీరెడ్డి (చిత్రలేఖనం)లను పురస్కారాలకు ఎంపిక చేసినట్లు ప్రకటించారు. జనవరి నెలలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో కీర్తి పురస్కారాలను ప్రధానం చేయనున్నట్లు వెల్లడించారు. పురస్కారం పేరిట ఐదు వేల నూటపదహారు నగదుతో పాటు పురస్కార పత్రాన్ని అందజేయనున్నారు.