దశాబ్దాల తరబడి కరువు ప్రాంతంగా ఉన్న తిరుమలగిరిలో గోదావరి జలాలను పరవళ్లు తొక్కించి సస్యశ్యామలం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మార్పులో కీలకంగా ఉన్న ఎస్సారెస్పీ కాల్వల ఉనికి నేడు కొందరి స్వార్థం కారణంగా ప్రశ్నార్థమవుతున్నది. అక్రమార్కులు అడ్డగోలుగా కాల్వ కట్టలను తవ్వి మట్టి విక్రయిస్తున్నారు. మరికొందరు ఆక్రమించి సాగు చేస్తున్నారు. కండ్ల ముందే కాల్వలు ధ్వంసమవుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
ట్రాక్టర్ మట్టి రూ.900
ఎస్సారెస్పీ కాల్వల కట్టల మట్టికి ప్రాంతాన్ని బట్టి ధరలు నిర్ణయించి విక్రయిస్తున్నారు. కాల్వ సమీప గ్రామాల్లో ట్రాక్టర్ మట్టి రూ.500 కాగా, తిరుమలగిరి మున్సిపాలిటీలో రూ.900గా నిర్ణయించారు. ఇండ్ల నిర్మాణాలకు, వెంచర్లకు, మట్టిరోడ్లకు, ఖాళీ ప్లాట్లకు తరలించి డబ్బులు దండుకుంటున్నారు. మట్టి తరలింపు కోసం జేసీబీలు, ట్రాక్టర్లు కొనుగోలు చేయడం పరిస్థితికి అద్దం పడుతున్నది. వాస్తవానికి కుంటలు, చెరువుల్లో మట్టి తరలించాలంటే నీటి పారుదల శాఖ అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. నిబంధనలకు అనుగుణంగా డీడీలు తీసి మట్టి తీయాల్సి ఉంటుంది. కానీ అవేమీ పట్టించుకోవడం లేదు.
కాల్వల హద్దులు ఏర్పాటు చేయాలి…
69డీబీఎం ఎస్సారెస్పీ కాల్వ పరిధిలో 67,956 ఎకరాల ఆయకట్టు ఉన్నది. కాల్వ మధ్య నుంచి కుడి వైపు 34.09 మీటర్లు (114.50ఫీట్లు), ఎడమ వైపు 37.05 మీటర్లు (121.55ఫీట్లు ) మొత్తంగా కాల్వ పరిధి 70.98 మీటర్లు (232.87ఫీట్లు ) ఉండాలి. కానీ, చాలా చోట్ల కట్టలను ధ్వంసం చేసి భూమి ఆక్రమించారు. 69డీబీఎం పరిధిలోని ప్రధాన కాల్వ వెంట సుమారు 10 ఎకరాలకు పైగా భూమి అక్రమణకు గురైనట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. నీటి పారుదల శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి కాల్వల హద్దులు గుర్తించి భూముల ఆక్రమణతో పాటు మట్టి తరలింపును అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ట్రాక్టర్ మట్టి రూ.900
ఎస్సారెస్పీ కాల్వల కట్టల మట్టికి ప్రాంతాన్ని బట్టి ధరలు నిర్ణయించి విక్రయిస్తున్నారు. కాల్వ సమీప గ్రామాల్లో ట్రాక్టర్ మట్టి రూ.500 కాగా, తిరుమలగిరి మున్సిపాలిటీలో రూ.900గా నిర్ణయించారు. ఇండ్ల నిర్మాణాలకు, వెంచర్లకు, మట్టిరోడ్లకు, ఖాళీ ప్లాట్లకు తరలించి డబ్బులు దండుకుంటున్నారు. మట్టి తరలింపు కోసం జేసీబీలు, ట్రాక్టర్లు కొనుగోలు చేయడం పరిస్థితికి అద్దం పడుతున్నది. వాస్తవానికి కుంటలు, చెరువుల్లో మట్టి తరలించాలంటే నీటి పారుదల శాఖ అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. నిబంధనలకు అనుగుణంగా డీడీలు తీసి మట్టి తీయాల్సి ఉంటుంది. కానీ అవేమీ పట్టించుకోవడం లేదు.
ఎస్సారెస్పీ కాల్వ కట్టలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి.
అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మట్టిని తరలించుకుపోతూ కట్టలను ధ్వంసం చేస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా మొరం తరలిస్తూ లక్షలు గడిస్తున్నారు. ఫలితంగా భారీ వర్షాల సమయంలో వరద వల్ల కాల్వలు కోతకు గురవుతున్నాయి. దాంతో మున్ముందు చివరి ఆయకట్టుకు నీరందడం కష్టమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెలిశాల గ్రామం నుంచి ప్రారంభమైయ్యే 69డీబీఎం ప్రధాన కాల్వ 12 కిలోమీటర్ల మేర మట్టి కట్టలు ధ్వంసమయ్యాయి. ఎస్సారెస్పీ ఫేజ్-2 కార్యాలయానికి అత్యంత సమీపంలోనే ఇంతా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలొస్తున్నాయి.
కాల్వల హద్దులు ఏర్పాటు చేయాలి…
69డీబీఎం ఎస్సారెస్పీ కాల్వ పరిధిలో 67,956 ఎకరాల ఆయకట్టు ఉన్నది. కాల్వ మధ్య నుంచి కుడి వైపు 34.09 మీటర్లు (114.50ఫీట్లు), ఎడమ వైపు 37.05 మీటర్లు (121.55ఫీట్లు ) మొత్తంగా కాల్వ పరిధి 70.98 మీటర్లు (232.87ఫీట్లు ) ఉండాలి. కానీ, చాలా చోట్ల కట్టలను ధ్వంసం చేసి భూమి ఆక్రమించారు. 69డీబీఎం పరిధిలోని ప్రధాన కాల్వ వెంట సుమారు 10 ఎకరాలకు పైగా భూమి అక్రమణకు గురైనట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. నీటి పారుదల శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి కాల్వల హద్దులు గుర్తించి భూముల ఆక్రమణతో పాటు మట్టి తరలింపును అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వెలిశాల నుంచి ప్రగతి నగర్ వెళ్లే 69డీబీఎం ప్రధాన కాల్వ కోతకు గురై గండిపడింది. దీనికి కూత వేటు దూరంలో రోజూ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కోతకు గురైన కాల్వను పూడ్చే నాథుడు లేడని రైతులు వాపోతున్నారు. మట్టి తరలింపు కొనసాగితే గండ్లు పూడ్చటానికి ఇబ్బందులు తప్పవని చెప్తున్నారు.
మట్టి కట్టలు కాల్వలకు రక్షణ గోడలు…
ఎస్సారెస్పీ కాల్వలకు ఇరువైపులా మట్టి కట్టలు రక్షణ గోడలుగా నిలుస్తున్నాయి. వర్షాలకు వరద వస్తే కాల్వలు కోతకు గురికాకుండా కాపాడుతాయి. అదే విధంగా కంపచెట్లు కాల్వలకు అడ్డురాకుండా నిలువరిస్తాయి. ఎక్కడైనా గండి పడితే వెంటనే మొరం పోసి పూడ్చటానికి వీలుగా ఉంటుంది. అదే విధంగా కాల్వ పరిధిలోని భూము లు ఆక్రమణకు గురికాకుండా నిలువరిస్తాయి. ఇన్ని రకాలుగా ఉపయోగపడే మట్టిని తరలించుకుపోవడంతో తీవ్ర నష్టం పొంచి ఉన్నది. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
కాల్వలు ధ్వంసమైతే మళ్లీ మొదటికే..
కాల్వలు ధ్వంసమైతే పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుందని, కరువు ప్రాంతంగా మారే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్ల రూపాయలు వెచ్చించి కాల్వల మరమ్మతు, లైనింగ్ పనులు చేపట్టి చివరి ఆయకట్టుకు సైతం నీరందిస్తున్నది. ఈ క్రమంలో భూగర్భ జలాలు పెరిగి సాగునీటి గోస పోయింది. గతంలో 300 ఫీట్ల కింద ఉన్న భూగర్భ జలాలు నేడు 50 ఫీట్ల లోతులో లభిస్తున్నాయి. ఎస్సారెస్పీ కాల్వల పుణ్యమా అని నియోజకవర్గంలో భూములు సిరుల మాగాణాగా మారిపోయాయి. కాల్వల కట్టలను కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని స్థానికులు పేర్కొంటున్నారు.
కాల్వలను కాపాడుకోవాలి…
ఒకనాటి కరువు ప్రాంతం ఇయ్యాల నీళ్లతోని కళకళలాడుతున్నది. గతంలో తాగు, సాగునీరు లేక చాలా ఇబ్బంది పడ్డాం. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి గోస పోయింది. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీరు అందించి చెరువులు, కుంటలు నింపుతున్నది. కాల్వలను కాపాడుకోకుంటే ఇబ్బందులు తప్పవు. అధికారులే కాదు కాల్వలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది.
అక్రమార్కులపై కేసులు నమోదు చేయాలి
కాల్వల కట్టల మట్టిని తరలించే వారిపై క్రిమినల్ కేసు లు నమోదు చేయాలి. గతంలో కాల్వలకు గండ్లు పెడితే కేసులు నమోదు చేశారు. దాంతో ఆ సమస్యకు అడ్డుకట్ట పడింది. అదే విధంగా కాల్వ మట్టి తరలించే వారిపై కేసులు నమోదు చేసి భారీగా జరిమానా విధించాలి. ట్రాక్టర్లు, జేసీబీలు సీజ్ చేయాలి. అప్పుడే కాల్వ కట్ట మట్టి తరలింపు ఆగిపోతుంది.
కోక్యానాయక్ తండా మట్టి తరలిస్తే కేసులు నమోదు చేస్తాం
ఎస్సారెస్పీ కాల్వ కట్టల మట్టిని తరలిస్తే కేసులు నమోదు చేస్తాం. త్వరలోనే క్షేత్రస్థాయిలో పర్యటిస్తాం. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కాల్వల హద్దు లు ఏర్పాటు చేస్తాం. సిబ్బంది కొరత వల్ల కొంత దృష్టి పెట్టలేక పోతున్నాం.