సూర్యాపేట రూరల్, ఆగస్టు 27 : వచ్చే నెల 1న నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభంకానున్న నేపథ్యంలో పారిశుధ్య పనులు చేపట్టి సర్వం సిద్ధం చేయాలని జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగేంధర్‌రావు అన్నారు. మండలంలోని ఇమాంపేట ప్రభు త్వ పాఠశాలను జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డితో కలిసి శుక్రవారం ఆమె సందర్శించారు. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు మంచినీటి వసతి ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. తరగతి గదులను శానిటైజ్ చేయాలన్నారు. అనంతరం పాఠశాలలో మిషన్ భగీరథ నల్లాను జడ్పీటీసీ జీడి భిక్షం ప్రారంభించారు.కార్యక్రమంలో ఎంఈఓ శైలజ, సర్పంచ్ పాముల ఉపేందర్, ఎంపీటీసీ మామిడి కిరణ్, అధికారులు ఏఈ భరత్‌కుమార్, సీడీపీఓ కిరణ్మయి, ఉపసర్పంచ్ కుంభం సుజాతావెంకన్న, నాయకులు నాగరాజు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
మఠంపల్లి : మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఆదర్శ, గురుకుల, కేజీబీవీ పాఠశాలల్లో అధికారులు, ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ముమ్మరంగా పారిశుధ్య పనులను చేపడుతున్నారు. ఈసందర్భంగా పాఠశాల ఆవరణలోని పిచ్చిమొక్కలు,చెత్త చెదారం తొలగించారు. మఠంపల్లిలో సర్పంచ్ మన్నెం శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో ప్రాంగణంలో పారిశుధ్య పనులు చేపట్టారు. కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
తిరుమలగిరి : మండలంలోని తొండ ప్రాథమికోన్నత పాఠశాలలో పారిశుధ్య కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాల గదులు, బెంచీలు శుభ్రంచేసి పాఠశాల ఆవరణలోని పిచ్చిమొక్కలను తొలగించారు.
నాగారం: మండల కేంద్రంలోని పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎస్ఎంసీ చైర్మన్ చిప్పలపల్లి మల్లేశ్ అవగాహన కల్పించారు. పాఠశాలల్లో కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వర్ధెల్లి మల్లయ్య, వెంకటమల్లు, వీరేశం, సోమ య్య ఉన్నారు.
హుజూర్నగర్ : అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసు కోవాలని సీడీపీఓ విజయలక్ష్మి సూచించారు. హుజూర్నగర్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ, ఆయాలతో పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రాల్లో వంట సామగ్రి, బరువు యంత్రాలు, ఆట వస్తువులు, ఇతర సామగ్రిని శుభ్రం చేసి పెట్టుకోవాలన్నారు. కొవిడ్ నిబంధనలను పాటించాలన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.