అమరులను స్మరించుకుంటూ సాగడం ప్రతి ఒక్కరి బాధ్యత
ఉద్యమాల గడ్డగా సూర్యాపేటకు చరిత్ర ఉంది
విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
సూర్యాపేటలో తెలుగు స్వాతంత్య్ర సమరయోధుల ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం
దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఎందరో వీరులు అమరులయ్యారు.. తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ ఎందరినో కోల్పోయాం.. అమరుల త్యాగ ఫలమే నేటి స్వేచ్ఛా వాతావరణం.. అమరులను స్మరించుకుంటూ ముందుకు సాగడం ప్రతి ఒక్కరి బాధ్యత’ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా సూర్యాపేటలోని గాంధీ పార్క్‌లో గురువారం ఏర్పాటు చేసిన ప్రముఖ తెలుగు స్వాతంత్య్ర సమరయోధుల ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇలాంటి ఎగ్జిబిషన్
ద్వారా మహా యోధుల పోరాటాలు, సేవలను గుర్తుకు
తెచ్చుకోవచ్చన్నారు.
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట టౌన్, ఆగస్టు 26 : అమరుల త్యాగ ఫలమే.. నేటి సేచ్ఛా వాతావరణమని, దేశ స్వాతంత్య్రంలో ఎందరో వీరులు అమరులయ్యారని, తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ ఎందరినో కోల్పోయామని, అమరులను స్మరించుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామం ప్రారంభమై 75 ఏండ్లు నిండిన సందర్భంగా చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఫీల్డ్ పబ్లిసిటీ నల్లగొండ యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రముఖ తెలుగు స్వాతంత్య్ర సమరయోధుల ఫొటో ఎగ్జిబిషన్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాట సమరంలో ఎంతోమంది ప్రాణాలను త్యాగం చేయడం వల్లే నేడు మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని అన్నారు. అలాంటి మహనీయులను గుర్తుచేస్తూ ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అలాగే తెలంగాణ కోసం అమరులైన వారందరినీ స్మరించుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణ బాటలో నడుస్తున్నదని వివరించారు. కార్యక్రమంలో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, జడ్పీటీసీ జీడి భిక్షం, కోటేశ్వర్రావు, గండూరి శంకర్, వాసా శ్రీశైలం పాల్గొన్నారు.
కోటపహాడ్ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించిన మంత్రి
ఆత్మకూర్ ఎస్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె ప్రకృతి వనాలతో పల్లెలు ప్రశాంతతకు నిలయాలుగా మారుతున్నాయని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కోటపహాడ్ గ్రామ ప్రకృతి వనాన్ని స్థానిక నేతలతో కలిసి మంత్రి సందర్శించారు. ప్రకృతి వనాలతో పల్లెల్లో పచ్చదనం పరుచుకున్నదని అన్నారు. గ్రామాలను సుందరవనంగా తీర్చిదిద్దడంలో ప్రజాప్రతినిధుల కృషి అమోఘమన్నారు. పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్రత, పచ్చదనం పెరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మర్ల చంద్రారెడ్డి, సర్పంచ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఆర్అండ్బీ అధికారులపై మంత్రి ఆగ్రహం
పెన్‌పహాడ్ : ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే సహించే ప్రసక్తే లేదని మంత్రి జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం మండలంలోని దూపాడ్ వద్ద ‘దురాజ్‌పల్లి-గడ్డిపలి’్ల ప్రధాన రహదారి పనులను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. దూపాడ్ వద్ద వేసిన రహదారి నెలరోజుల్లోనే శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు కలిసి మంత్రికి ఇటీవల విన్నవించారు. ఈ మేరకు మంత్రి తనిఖీ చేసి రహదారి దుస్థితిపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 15రోజుల్లో అంబేద్కర్ విగ్రహం నుంచి మిషన్ భగీరథ ట్యాంకు వరకు సీసీ రహదారిని నిర్మించాలని ఆదేశించారు. రహదారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన మంత్రికి గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఆయన వెంట నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, సర్పంచ్ బిట్టు నాగేశ్వర్రావు, వైస్ ఎంపీపీ గార్లపాటి సింగారెడ్డి, గుట్ట డైరెక్టర్ ఆవుల అంజయ్యయాదవ్, గార్లపాటి స్వర్ణ, బిట్టు వెంకన్న, సరోజన సైదయ్య, కొప్పోలు రంగమ్మ ఉన్నారు.