రైతులకు అందుబాటులో ఏఈఓలు
నిత్యం గ్రామాల్లో ఉంటూ సాగు సలహాలు
వ్యవసాయ విస్తరణలో కొత్త విప్లవంఏఈఓల
సహకారం ఇలా..
రైతు బంధు, బీమా, రుణమాఫీ, మద్దతు ధర, రాయితీ విత్తనాలు వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తద్వారా ఎలా లబ్ధి పొందాలో వివరిస్తున్నారు.
క్లస్టర్ వారీగా నియమితులైన ఏఈఓలు రైతు వేదికలో నిత్యం అందుబాటులో ఉంటూ సాగు మొదలు పెట్టినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకూ రైతులకు అందుబాటులో ఉంటున్నారు.
భూసారానికి అనుగుణంగా ఏ పంటలు సాగు చేయాలో తెలియజేస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల ఎంపికకు సంబంధించి సలహాలు ఇస్తున్నారు.
వాతావరణ పరిస్థితుల వల్ల పంటలకు వచ్చే చీడపీడలను పరిశీలించి పిచికారీ చేయాల్సిన మందులను సూచిస్తున్నారు.
సస్యరక్షణ చర్యలు, పంట మార్పిడి విధానంపై
అవగాహన కల్పించడంతో పాటు సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు రైతులకు
సహకరిస్తున్నారు.
పంటలను మద్దతు ధరకు విక్రయించుకునేందుకు కొనుగోలు కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాలను
అందిస్తున్నారు.
రాష్ట్రం ఏర్పడక ముందు ఏఈఓలు పరిమిత సంఖ్యలో ఉండి కార్యాలయాలకే పరిమితమయ్యేవారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వారి స్థాయికి తగ్గట్లుగా విధులు నిర్వర్తించే పరిస్థితులు ఏర్పడ్డాయి. మునుపెన్నడూ లేనివిధంగా వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ అత్యధిక నిధులు కేటాయిస్తుండడంతో
ఈ దిశగా అడుగులు పడ్డాయి. రైతులంతా ఒకచోట కూర్చొని సమస్యలపై చర్చించుకునేందుకు, వారికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు క్లస్టర్ల వారీగా రైతువేదికలను నిర్మించారు.
ఈ వేదికలో ఏఈఓల కోసం ప్రత్యేక
క్యాబిన్లు సైతం ఏర్పాటు చేశారు. దీంతో వ్యవసాయ విస్తరణ అధికారులు
పల్లెల్లోనే ఉంటూ అన్నదాతలకు విలువైన సలహాలు ఇస్తున్నారు.
రైతులకు సేవ చేయడం అదృష్టం
రైతు కుటుంబంలో పుట్టిన నాకు రైతులకు సేవ చేసే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తు న్నా. రైతు వేదికలో నిత్యం అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి సస్యరక్షణ చర్యలు చేపడుతున్నాం. మద్దతు ధర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నాం.
సంతోషంగా ఉంది… రైతులకు సేవచేసే అవకాశం
వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మాది చివ్వెంల మండలం వట్టి ఖమ్మంపహాడ్. నాకు చిన్నప్పటి నుంచి వ్యవసా యం అంటే చాలా ఇష్టం. అందుకే డిప్లొమా అగ్రికల్చర్ కోర్స్ తీసుకున్నా. ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్న. దేశానికి అన్నం పెట్టే రైతుకు సేవ చేయడం గర్వంగా ఉంది.
మార్కెట్కు పోటెత్తుతున్న పెసర్లు
తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్కు పెసర్లు పోటెత్తాయి. ఈ సీజన్లో గత రెండ్రోజుల నుంచి పెసర్లు ఎక్కువగా వస్తున్నాయి. బుధవారం 384 బస్తాలు, గురువారం 389 బస్తాలు వచ్చాయి. క్వింటాకు అత్యధిక ధర రూ.6400 కాగా అత్యల్పం రూ.3500. అదేవిధంగా మోడల్ ధర రూ.6066గా నమోదైంది. రైతులు నాణ్యమైన పెసర్లు తెచ్చి ప్రభుత్వ మద్దతు ధర రూ.7275 పొందాలని మార్కెట్ కార్యదర్శి అల్తాఫ్ కోరారు.
తిరుమలగిరి, ఆగస్టు 26