రోగులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలి
డీఎంహెచ్ఓ కోటాచలం
పీహెచ్సీ పనితీరుపై అసంతృప్తి
పెన్‌పహాడ్, ఆగస్టు 25 : కరోనా, డెంగీ, చికున్ గున్యా తదితర వ్యాధులు వ్యాప్తి చెందకుండా వైద్యారోగ్య సిబ్బంది ముందస్తు చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లోని ప్రజలకు వ్యాధులపై అవగహన కల్పించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి సిబ్బందిపై మండిపడ్డారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే ప్రజలకు ఆరోగ్య సూత్రాలు పాటించాలని ఎలా సూచిస్తారని ప్రశ్నించారు. కొవిడ్ టెస్టులు, టీకాల రిజిష్టర్‌ను పరిశీలించి.. పీహెచ్సీలో అందిస్తున్న సేవలపై రోగులతో ముఖాముఖి మాట్లాడారు. అనంతరం సిబ్బందితో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో డీఎంహెచ్ఓ మాట్లాడారు. గ్రామాల్లోని వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ గ్రామపంచాయతీ సహకారంతో పైపులైన్ లీకేజీ, పారిశుధ్యం మెరుగుపడేలా కృషి చేయాలన్నారు. అనాజీపురంలో ఓ మహిళ డెంగీ వ్యాధి బారిన పడ్డారని తెలిపారు. గ్రామంలో అవసరమైతే ప్రత్యేక క్యాంపు నిర్వహించి వైద్య సేవలు అందించాలన్నారు. కొవిడ్లపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నందున వైద్య సిబ్బంది పర్యవేక్షణ చేస్తూ విద్యార్థులకు సేవలు అందించాలన్నారు. సిబ్బంది పనితీరును మెరుగు పరుచుకోవాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రి గదులు, పరిసరాల్లో ప్రతి రోజూ హైడ్రోక్లోరైట్తో పిచికారీ చేయాలన్నారు. ఆర్బీఎస్కే జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ వినయానంద్, క్వాలిటీ మేనేజర్ అరుణ, డిప్యూటీ ఉప మీడియా అధికారి అంజయ్య, వైద్యాధికారి డాక్టర్ క్రాంతికుమార్