సూర్యాపేట టౌన్, ఆగస్టు 16 : సూర్యాపేట జిల్లా కేంద్రంలో అత్యంత ప్రాశస్త్యం పొందిన వేంకటేశ్వరస్వామి ఆలయానికి మహర్దశ పట్టనుంది. సుమారు రూ.12 కోట్ల అంచనా వ్యయంతో ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అంకురార్పణ చేశారు. ఈ నెల 23న భూమిపూజ చేయాలని సంకల్పించారు. అందుకు ముఖ్యఅతిధిగా త్రిదండి చినజీయర్ స్వామిని ఆహ్వానించారు. సోమవారం ఉదయం హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో చినజీయర్ స్వామి ఆశ్రమానికి మంత్రి జగదీశ్‌రెడ్డి సతీమణి సునీతారెడ్డితో కలిసి వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అందుకు చినజీయర్ స్వామి అంగీకరించినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి దంపతులను చినజీయర్ స్వామి ఆశీర్వదించారు.