75వ స్వాతంత్య్ర దినోత్సవానికి ఉమ్మడి జిల్లా సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించే వేడుకలకు ఆయా జిల్లా కేంద్రాల్లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సూర్యాపేటలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి
గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, నల్లగొండలో హోం మంత్రి మహమూద్ అలీ, యాదాద్రిలో ప్రభుత్వ విప్ గొంగిడి
సునీతామహేందర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఉత్తమ అధికారులకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు, పరేడ్ రిహార్సల్‌ను
ఉన్నతాధికారులు శనివారం పరిశీలించారు. కరోనా పరిస్థితుల్లో వేడుకకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ కొవిడ్
నిబంధనలు పాటించాలని సూచించారు.
సూర్యాపేట, ఆగస్టు 14 : స్వాతంత్య్ర దినోత్సవాల్లో కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎస్ మోహన్‌రావు అన్నారు. శనివారం శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. అభివృద్ధిని ప్రతిబింబించేలా శకటాలను రూపొందించాలని, పథకాలు వివరించేలా స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. వేడుకల వద్ద ప్రొటోకాల్ పాటించాలని, అతిథులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లు జరుగకుండా వేడుకలు విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జడ్పీసీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీఆర్డీఓ కిరణ్ కుమార్, ఐసీడీఎస్ పీడీ నర్సింహారావు, డీఏస్ఓ విజయలక్ష్మి, సంక్షేమ అధికారులు శిరీష, దయానంద రాణి, ఉపేందర్, శంకర్, ఆర్అండ్బీ ఈఈ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.
దేశం మనది
భారత దేశం మనది
మువ్వన్నెల జెండా మనది
కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు గల అఖండ భారత్ మనది
ఎన్నో సంవత్సరాలు అనుభవించాం పారతంత్య్రం
1947లో సాధించాం స్వాతంత్య్రం
ఆగస్టు 15న జరుపుకొంటాం స్వాతంత్య్ర దినోత్సవం
వాడవాడలో వేడుకగా జరుపుకొంటున్నాం ఈనాటి ఉత్సవం
ఎందరో సమరయోధుల త్యాగ ఫలం స్వాతంత్య్రం
స్మరించుకోవాలి సమరయోధులను నిరంతరం
ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది
సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన దేశం మనది
ప్రపంచానికి గురు స్థానంలో ఉన్న దేశం మనది
ఆదికవి నన్నయ అవతరించిన నేల
విశ్వకవి రవీంద్రుడు జన్మించెను ఇల
ప్రపంచానికి శాంతిని ప్రబోధించిన దేశం నాది
పంచశీలను ప్రతిపాదించిన దేశం నాది
విస్తారమైన సహజ వనరులున్న దేశం మనది
సుస్థిరమైన ప్రజాస్వామ్య దేశం మనది
రచన